Thursday, December 24, 2009

ఔను. తెలంగాణా ప్రజలు తెలబన్సే

                ఈ మద్య కొందరు తెలుగు వాళ్ళు(మన ఖర్మ కొద్ది) తెలుగు వారందరం కలిసి ఉండాలి అంటూనే,మళ్ళి అదే తెలుగు ప్రజలైన తెలంగాణ వారిని తాలిబాన్ల తో పోల్చుతూ తెలబాన్స్ అని పిలుస్తున్నారు. ఇదెక్కడి విడ్డురం. పొమ్మన లేక పొగ బెట్టడం అంటే ఇదేనేమో. అలా అన్న వారికి నేను చెప్పేది ఒక్కటే గాందీ మార్గంలో, "ధన్య వాదాలు". తెలంగాణ వారిని తాలిబన్లతో పోల్చి తెలబన్స్ అని పిలిచి ప్రపంచ స్థాయి కి చేర్చినందుకు.
               1989 లో  తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, తాము నమ్మిన సిద్దాంతాల్ని అమలు పరుచుకోవడానికి తమ వారిని బానిసలు గా చేసి కనీసం తమకు ఇష్టమైన చదువుని కూడా దూరం చేస్తున్న రష్యా వారిని ఎదిరించటానికి కన్నా వాళ్లకి దూరమై, ఇష్టమైన చదువుని, వృత్తుల్ని త్యాగం చేసి రష్యా వాళ్ళ పై  పోరాటం జరిపి తమ దేశం నుండి రష్యా సేనల్ని తరిమి గొట్టిన తాలిబన్లతో తెలంగాణా వాళ్ళని పోలిస్తే, అవును తెలంగాణా వాళ్ళు తెలబన్సే. ప్రపంచంలో తామే ధనిక దేశంగా వుండాలని కలలు కంటూ, మిగతా దేశాలను పట్టి పీడిస్తూ, వాళ్ళ మతాలను హేళన చేస్తూ, సంస్కృతులను కాలరాస్తూ, ఎదుటి దేశాల పై యుద్దాలు ప్రకటిస్తూ యుద్ద దాహాన్ని తీర్చుకుంటున్న అమెరికా ని, తమ మతాన్ని, సంస్కృతి ని కాపాడుకోవడానికి ఎదిరించిన తాలిబాన్ల తో పోలిస్తే అవును తెలంగాణా ప్రజలు తేలబన్సే.
                    తెలంగాణా ప్రజలు తెలబన్స్ అయితే మరీ మిగతా తెలుగు ప్రజలు (ఇక్కడ నా సోదర సమానులైన మిగతా తెలుగు ప్రజలు నన్ను క్షమించ గలరు) అందబన్సా? అంటే నిజ నిజాలు తెలుసుకోకుండా కుట్ర కుతంత్రాలతో కళ్ళు మూసుకు పోయిన అజ్ఞానం  లో  ఉన్న ఆంధులా? బ్లాగుల్లో  తెలబన్స్ అంటూ రాయటం తప్ప ఇంకేమి తెలియని  చావా కిరణ్ లాంటి వాళ్ళు ఆంధ్ర వాళ్ళతో గోడవోస్తే "ఆంధ్ర వాళ్ళని అడుక్కు తినే అందబాన్స్" అని రాయల సీమ వాళ్ళతో గోడవోస్తే "రాళ్ళు కొట్టు కోవడానికి తప్ప ఎందుకు పనికి రాని రాలబన్స్" అని అంటారు. ఇలా రెచ్చగొట్టి ప్రజా మనో భావాలని దెబ్బ తీసే వాల్లున్నంత కాలం రాష్ట్రం లో ప్రజలు కాదు కదా ఇంట్లో అన్నదమ్ములు కూడా కలిసుండ లేరు.
                    కాబట్టి తెలుగు ప్రజలు ఎలాంటి అవకాశవాదుల మాటలు నమ్మకుండా అన్నదమ్ముల మాదిరిగా కలిసి కట్టుగా రాష్ట్ర బాగు కోసం ఒక నిర్ణయానికి వచ్చి దాని ప్రకారం నడుచుకోవాలి, అదీ  ప్రత్యేక తెలంగాణా ఐనా సరే. సమైక్యంద్ర ఐనా సరే.
                      

11 comments:

  1. తెలబాన్స్ కోరుకునేది ఆంధ్ర బ్రిటిషేర్స్ తో విడిపోవాలని......

    ReplyDelete
  2. తెల౦గాణ వాళ్ళ౦దరూ తెలబాన్లు కాదు. తెల౦గాణ లోని అస౦బద్ద వేర్పాటువాద అతివాదులనే తెలబాన్లు అ౦టారు(అచ్చ౦ ముస్లి౦ అతివాదులు తాలిబాన్లయినట్లు). తాలిబాన్లన౦టే ముస్లి౦లను అవమాని౦చినట్లా? తాలిబాన్ల౦టే చాలామ౦ది ముస్లి౦లకు అసహ్య౦. అలాగే తెలబాన్లూ తెల౦గాణ వారిచేత ఆమోద౦పొ౦దలేక, తమకు తామే ఇతర తెల౦గాణవారితో పోలిక తెచ్చుకు౦టున్నారు.

    ReplyDelete
  3. విచక్షణ మరిచిపోయి బస్సులను తగులబెడుతూ,షాపులై దాడి చేసి ఆస్థులను ధ్వంసం చేస్తూ, షూటింగ్ లను అడ్డుకుని హీరోలని ఫీలై పోతూ, అమాయకులను భయబ్రాంతులకు గురి చేస్తూ తమ తీవ్రపదజాలంతో శాంతికి విఘాతం కలిగిస్తున్న వారిని ఉద్దేశించి మాత్రమే ఈ పదం వాడబడిందని గమనించగలరు. శాంతియుతంగా ఉద్యమాలు చేస్తున్న వారికీ, అమాయకులైన తెలంగాణా ప్రజలకు ఇది వర్తించదని అర్థం చేసుకోగలరు.

    ReplyDelete
  4. పనికిమాలిన చేతకాని దురాలోచనతో అవగాహన అనేది లేకుండా తలాతోకకు కూడా సరిపోని పోలికతో మీ కుళ్ళు బుద్దికి నిదర్శనంగా కలుషితమైన ఈ వెటకారం దరిద్రమైన వివక్షతో నిండినట్టు నిరూపించడానికి ప్రమాణము.

    తెలంగాణ వేర్పాటు వాదులకు ఎగతాళి పేరు పెట్టేముందు తాలిబన్లంటే నిజమైన అర్థమేమిటో మిగతా ప్రపంచం దేనికి పర్యాయంగా వాడుతోందో తెలుసుకోరా అజ్ఞాని శుంఠ.

    ReplyDelete
  5. మీరు అనుకుంటున్న అర్థం సరైనది కాదు. తెలబాన్స్ అంటే తెలుగువాళ్ళలో ఉన్న ప్రాంతీయోన్మాదులు. అంతేకాక ఆ ఉన్మాదం హింసారూపం దాల్చినవారు. అది తెలంగాణ అయినా, కోస్తా అయినా రాయలసీమ అయినా ప్రాంతీయ ఉన్మాదం ఉన్న ప్రతి తెలుగువాడూ తెలబానే. ఇది ప్రత్యేకంగా తెలంగాణ ప్రజల గుఱించి వాడబడుతున్న పదం కాదు.

    ReplyDelete
  6. తెలంగాణా వారిపై 'ఆంధ్రా' వారిమని చెప్పుకునే వారికి ఉన్న చులకన భావం, ఆధిపత్య ధోరణి, ఏహ్య భావం అన్నీ కలగలిసిన రూపమే ఈ 'తెలబాన్' అనే పద ప్రయోగం. ఒక వైపు 'తెలబాన్' లాంటి పద ప్రయోగం చేస్తూనే సమైక్య రాగం ఆలాపించడం అంటే తెలంగాణా ప్రజల్ని వెర్రి వెంగలప్పల కింద జమ కట్టడమే. వీరికి కావలసింది సమైక్యాంధ్ర కాదు. తెలంగాణా లోనుచి పారే అపారమైన జల సంపదని కొల్ల గొట్టడం. తద్వారా కోట్లు గడించి తెలంగాణా ఆస్తులను కొని మళ్ళీ కోట్లు గడించడం. చివరిగా డబ్బు బలంతో తెలంగాణా వారిని కట్టు బానిసలు గా చేసుకోవడం.

    ReplyDelete
  7. @తాడేపల్లి

    'తెలబాన్' అనే పదాన్ని తెలంగాణా వారిపై కాకుండా ఆంద్ర, రాయల సీమ ప్రాంతం వారిపై ప్రయోగించిన ద్రుష్టాంతాన్ని ఒక్కటి చూపించండి. కొందరు బ్లాగర్లు మాత్రం 'కేవలం తెలంగాణా వేర్పాటు వాదులే' అని ఆ పదం వాడిన ప్రతిసారీ బ్రాకెట్లలో పెడతారు. అయినా తెలంగాణా వేర్పాటును కోరుకోవడం ప్రతి తెలంగాణా పురుడి హక్కు. తెలంగాణాను కోరుతున్న వారు రాయలసీమ ఫాక్షనిస్టుల కన్నా, ఆంధ్రా ప్రాంతం రవుడీల కన్నా హింసా వాదులు కారు. ఈనాడు లక్షల మంది ఆంధ్రా వారు తెలంగాణా లో బ్రతుకుతున్నారు. తిండికి లేక పోయినా తెలంగాణా వారు ముంబాయి, భివండి, సూరత్, అహ్మదాబాద్, గల్ఫ్ మొదలైన ప్రదేశాలకు వెళ్లి బ్రతుకు తున్నారు కాని ఆంధ్రా వైపు కన్నెత్తి కుడా చూడలేక పోతున్నారు. దీన్ని బట్టే తెలుస్తుంది, ఆంధ్రా వారు ఎంతటి శాంతి దూతలో, ఎంతటి స్నేహ శీలురో.

    మీరు 'ఉన్మాదం' అనే పదాన్ని వాడారు కాబట్టి చెపుతాను. తెలంగాణా వారిది ఉన్మాదం కాదు, ప్రాంతీయ అభిమానం. డబ్బు మదం తలకెక్కి ఇతరులని 'తెలబాన్లు' గా అభివర్ణించే వారికి మీ పదం సరిపోతుంది.

    ReplyDelete
  8. ప్రస్తుతం ఇతర ప్రాంతాలవారిమీద దాడులు చేస్తున్నది తెలంగాణ వేర్పాటువాదులేనని అయినా ఒప్పుకుంటారా ? వారినెందుకు తెలబాన్లు అనకూడదు ? దొంగని దొంగ అని కాకుండా దొంగగారూ అని ఎందుకనాలి ? ఱేపెప్పుడైనా కోస్తా-సీమలవారు ఇతర ప్రాంతాలవారి మీద దాడులు చేస్తే ఆ దాడులు చేసినవారిని కూడా తెలబాన్లు అందాం. కానీ ఇంతవఱకూ వారు అందుకు పాల్పడినట్లు వార్తలు రాలేదు.

    ReplyDelete
  9. @ తెలంగాణా: ఈ టపా నేను తెలంగాణా వారిని సపోర్ట్ చేస్తూ రాసిందే తప్ప వారిని కించపరుస్తూ రాసింది ఏ మాత్రము కాదని మీరు అర్థం చేసుకోగలరు.

    ReplyDelete
  10. Telanganites and Andhraites share few traits rarely bunched among other Indians , i.e intolerance greed cultural decadence . Telanganites cultivated this vice as they amassed some wealth . Andhraites were suffering from it since ages . Both are hideous .

    ReplyDelete
  11. అవును మనం తెలబానులమే గర్వించాలి.
    ఇంకా గర్వించాలి మనము జిత్తులమారి గుంటనక్కలం (బాబులం) కాదు. గజ దోపిడి దొంగలం(వైఎస్సార్లం) కాదు.

    ReplyDelete