Monday, December 28, 2009

రాజకీయాల్లో రామ్ గోపాల్ వర్మ,తెలుగు ప్రజల ఖర్మ

             తెలుగు గడ్డ మీద పుట్టి ఒకానొక సమయం లో అందరి చేత బారత దేశం లోనే గొప్ప క్రియేటివ్  డైరెక్టర్ గా పేరు పొందిన రాంగోపాల్ వర్మ తాను పుట్టిన ఈ తెలుగు గడ్డ కి ఏం చేసాడు అని ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల గురించి కామెంట్ చేస్తున్నాడు.తాను తీసిన "ప్రేమకథ" అనే సినిమా బాగా ఆడలేదనే ఆక్రోశం తో తెలుగు ప్రజలకి అసలు టేస్టే లేదు అసలు సినిమాను ఎలా చూడాలో కూడా తెలియదు దూషించాడు. మళ్ళి ఇక్కడ  జన్మ లో సినిమాలు తీయన్ని చెప్పి ముంబై కి వెళ్ళిపోయిన అతను ఏ ముఖం పెట్టుకుని తన సినిమాలు తెలుగు లో మళ్ళి తీస్తున్నాడు.


                                                             

                        రామ్ గురించి చెప్పాల్సి వస్తే  రామ్ గోపాల్ వర్మ కి కొంచం అహంకారం ఎక్కువ. తన కన్నా పెద్ద స్టార్లతో సినిమాలు చేయాలంటే ఇతడు ఒప్పుకోడు. ఇది ఇప్పటికే రుజువయింది చిరంజీవి సినిమాను ఆపేయడం ద్వారా. ఆ విషయాన్ని రామే స్వయంగా ఒప్పుకున్నాడు tv9 ఇంటర్వ్యూ లో. (హిందీ లో అమీర్ ఖాన్, అమితాబ్ లతో తీసిన అవి వాళ్ళ కెరీర్ అంతంత మాత్రంగా ఉన్నపుడే, అమీర్ కి ఇమేజ్ వచ్చాక మళ్ళి అమీర్ తో తీయను అని చెప్పాడు). రామ్ ముందు నుంచి కొంచం డిఫరెంటే. తాను తీసిన సినిమా తనే బాగా లేదంటాడు కొన్ని రోజుల తర్వాత. పెళ్లి చేసుకోవట్లేదు ఏంటి ఫ్యామిలీ లైఫ్ ఇష్టం లేదా? అని అడిగితే హీరోయిన్స్ ఉన్నారు కదా అంటాడు. మరీ రామ్ కంటికి హీరోయిన్స్ అంతా చీప్ గా కనబడుతున్నరేమో. సినిమాలు తీస్తాడు, రిలీజ్ అవక ముందే పార్ట్-2 అనౌన్స్ చేస్తాడు. పోనీ అవి తీస్తాడా? అంటే అదీ లేదు. అవి ఎందుకు బాగా ఆడలేదు అని అడిగితే, సినిమాలు నా కోసం నేను తీసుకుంటాను, ప్రజల కోసం తీయను అంటాడు. మరీ అలాంటపుడు రిలీజ్ చేయకుండా తనే ఇంట్లో చూసుకోవచ్చు కదా. పైగా తీసిన సినిమాల్లో నటించిన వాళ్లకి రెమ్యునరేషన్ ఇస్తాడా అంటే అదీ లేదు. పాపం ఒకసారి తన గోడు ని జే.డి చక్రవర్తి మీడియా ముందు వెల్లగక్కుకున్నాడు ఏమి చేయలేక.  
                      ప్రస్తుత విషయానికొస్తే రాము కి వివాదాలన్న క్రైం అన్నా చాల మక్కువ ఎక్కువ. అందుకే కాబోలు ముంబై దాడుల తర్వాత అందరు హోటల్ తాజ్ దగ్గరికి అక్కడి వారిని పరామర్శిండానికి వెళితే మన వాడు మాత్రం కథ ఏమైనా దొరుకుతుందేమో అని వెళ్ళాడట. దాని ఫలితం మహారాష్ట్ర సి.ఎం. రాజీనామా మన వర్మ ని వెంటబెట్టుకేల్లినందుకు. తాను తీయబోయే రక్త చరిత్ర అనే సినిమాకి ఏమైనా ఉపయోగ పడుతుంది అనే ఉద్దేశం తోనే గొడవలు పెంచడానికి తన అభిప్రాయం సూటి గా చెప్పకుండా లగడపాటి కి సపోర్ట్ చేసినట్టు కనబడుతోంది రాష్ట్ర రాజకీయాల విషయంలో.

10 comments:

  1. మీరు చాలా అపోహల్లో ఉన్నారు.

    ReplyDelete
  2. asalu miku varma gurinchi emi teliyadu ani mi post chooste evarikaina telustundhi

    ReplyDelete
  3. మీ బ్లాగ్ పేరు లాగానే....మీ post కూడా చాలా పిచ్చి పిచ్చి గా వుంది...పెళ్ళి గురించి అడిగితే హీరోయిన్స్ వున్నారు కదా అని వర్మ ఎప్పుడూ అనలేదు...jd చక్రవర్తి తనకు వర్మ remunation ఇవ్వలేదని కూడా ఎప్పుడూ చెప్పలేదు..ఒక వ్యక్తి గురించి రాసేటప్పుడు అతని గురించి ఎంతో కొంత తెలిసుండాలి...అమితాబ్ ని మించిన star ఇండియాలో ఎవరున్నారో మీకే తెలియాలి.

    ReplyDelete
  4. రాజకీయాల్లో రామ్ గోపాల్ వర్మ అని రాయడంలో మీ ఉద్దేశం ఏమిటో అర్థం కాలేదు..ఈ దేశంలో ఎవరికైన తమ అభిప్రాయం తెలియచేసే హక్కువుంది ,వర్మ అదే చేశారు .ఎవరైనా రాజకీయాలు గురించి మాట్లాడితే రాజకీయాల్లో వున్నట్లా ? మీ లెక్క ప్రకారం అందరూ రాజకీయ నాయకులే...

    ReplyDelete
  5. రాంగోపాల్ వర్మ ఒక భాద్యత లేని దర్శకుడని నా అభిప్రాయం .మొదటి రెండు సినిమాలు తీసివేస్తే మిగతా సినిమాల్లో చాలావరకు సమాజం పై భాద్యత లేని సినిమాలే .దేవుడి మీద సినిమా తీసి ,సెన్సార్ పైన అలిగి నప్పుడే అయన సంచలనాలే సక్సెస్స్ మంత్రం అనుకును వుంటారు .గోవిందా గోవిందా లోనే అయన టాలెంట్ మసకబారింది. శివ సినిమా ని గమనిస్తే అందులో ఎంతోమంది కొత్త కళాకారులు / టెక్ని షియన్లు సమిష్టి కృషి అని నేనంటాను.ఎ సినిమా ఐన మనిషిలోని నవరసాలు కి స్పందించే తీరుని సొమ్ము చేసుకొంటై . హాస్యానికి జంధ్యాల ,ఆవేశానికి దాసరి ,ఆహ్లాదానికి విశ్వనాథ్ అయితే భీబత్సానికి ,జుగుప్సకి,భయనకానికి రాంగోపాల్ వర్మ .చాలామంది చెప్పినట్టుగా రాంగోపాల్ వర్మ ఒక్కడు సినిమా తీస్తే సినిమా అస్సలు చూడలేమేమో .
    నా ద్రిష్టిలో ప్రజలు అందరు రాంగోపాల్ వర్మ ని అక్క్సేప్ట్ చెయ్యలేరు .కాని బయటకు ఒప్పుకోరు .కథకుడిగా ,దర్శకుడిగా రామ్ దిగువ మధ్య స్తాయి
    శివ మిహాయిస్తే పెద్ద హీరోల సిఎమాలు రాం చెయ్యలేడు .ఎందుకంటే రాం కి కథానాయకుడికి హీరోయిజం క్రియేట్ చెయ్యడం ఇష్టంలేదనుకొంటా .
    టేకింగ్ కూడా చాలా మందికంటే పూర్ .తను చెప్పదలచుకుంది పూర్తి వెలుగులో చెప్పలేని ఒకే ఒక తెలుగు దర్శకుడు .ఆయన సినిమాల్లో నాకు నచ్చిన సినిమా క్షణ క్షణం మాత్రమే .

    ReplyDelete
  6. ఈ నలుగురిలో ఎవరికి ఎక్కువ మెంటలో చెప్పండి.

    ఎ) రాం గోపాల్ వర్మ

    బి) పోసాని

    సి) రాజ శేఖర్

    డి) మోహన్ బాబు

    ReplyDelete
  7. nenante9: చక్కగా చెప్పారు. దాదాపుగా పూర్తిగా ఏకీభవిస్తాను.
    bonagiri: ప్రశ్న అదిరింది. :) మొదటి స్థానం పోసానికిస్తానుగానీ, మిగతా స్థానాలు నిర్ణయించడం కాస్త కష్టమే!

    ReplyDelete
  8. bonagiri: భలే ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు ఆలోచిస్తే నాకు మెంటలెక్కుతుంది కాబట్టి చెప్పలేను.

    రాం గోపాల్ వర్మ ఒక దారి తప్పిన కళాకారుడు. తను తీసే పిచ్చి సినిమాలన్నీ తన అహాన్ని తృప్తి పర్చుకోడానికి తప్ప మరెందుకూ పనికిరావట్లేదు. ఓ రెండు మూడేళ్ళు, ఎవడికీ కనబడకుండా ఎటైనా వెళ్ళిపోయి, ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా మొదలెడితే, ఏదైనా మంచి సినిమా తీసే ఛాన్సు ఉందేమో అనుకుంటున్నాను.

    ReplyDelete
  9. రవి: "ఈ ప్రశ్నకు జవాబు ఆలోచిస్తే నాకు మెంటలెక్కుతుంది కాబట్టి చెప్పలేను." - :):)

    ReplyDelete
  10. రవి గారు, ఈ నలుగురు కలిసి ఒకే సినిమాలో పనిచేస్తే మనకు ఇంకెంత మెంటలెక్కుతుందో అలోచించండి.

    ReplyDelete