Wednesday, January 6, 2010

చచ్చు నా కంప్యుటర్ "పిచ్చి నా కొండే"

సంవత్సరానికి కాలాలు రెండు.ఒకటి చలి కాలం.రెండు ఎండా కాలం.(హైదరాబాదు వాసులం వర్షాకాలం మరచి పోయి చాలా సంవత్సరాలైంది).ఇక పోతే ఒక మనిషి జీవిత కాలానికి కాలాలు నాలుగు.
1.భూత కాలం.
2.వర్తమాన కాలం
3.భవిష్యత్ కాలం.  
4.పోయే కాలం. ఇది భూత,భవిష్యత్, వర్తమాన కాలాల్లో ఎపుడైనా రావచ్చు.
ఎవరికి టపా కట్టే కాలం (పోయే కాలం) వచ్చిందో కాని నేను ఈ టపా రాయడానికి భవిష్యత్ కాలాన్ని ఎంచుకున్నాను.

                    అదీ 2456 వ సంవత్సరం. హైదరాబాద్ దేశం లో మహా సముద్రం ఉప్పొంగి పొర్లుతుంది. ప్రజలందరూ ఆకాశంలో కిటికీలు తీసి కింద సముద్రపు అలల్ని ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న పిల్లలందరూ ఫ్లయింగ్ సాసర్ లతో సముద్రం లో దిగి కప్ప గెంతులాట ఆడుకుంటున్నారు.టి.వి. లో వెంజులా నాయుడు తీసిన "మొగలి మేకులు" సీరియల్ రెండు లక్షల ముప్పై నాలుగు వేల అయిదు వందల అరవై ఏదో బాగం ప్రసారమవుతుంది. ఇదే డైరెక్టర్ ఇంతకు ముందు "ఖూని రాగాలు", "చక్ర వాతం"ఆనే సీరియళ్ళు రెండు తీసి ఒకప్పటి బారత దేశ జనాభా ను సగానికి సగం తగ్గించినందుకు గాను అప్పటి బారత దేశ ప్రధాని "అదేదో గాంధి" చేతుల మీదుగా "బారత కుటుంబ నియంత్రణ పిశాచి" అనే బిరుదు ని కూడా సొంతం చేసుకున్నారు. ఇక సినిమా ల విషయానికొస్తే "బొందమూరి వంశం" లో 100 వ తరం వారసుడు "తట్టుబర్ల రత్న" తీసిన "పంటి కింద రాయి" (ది రోరింగ్ లయన్) అనే సినిమా లక్ష ముప్పై రెండు వేల థియేటర్లలో రెండవ రోజు పూర్తి చేసుకున్ని విజయవంతంగా మూడవ రోజు కి అడుగిడుతోంది. ఆ సినిమా కి వెళ్దామని అను రెండు రోజుల నుండి ఒకటే పోరు. సరే మూడో రోజు థియేటర్ లో ఆ సినిమా ఉంటే తప్పకుండ వెళ్దాం అని అనుకి మాటిచ్చాను. "అవును ఇంతకి అను ఎక్కడ?" సీన్ కత్తిరిస్తే (సీన్ కట్ చేస్తే)                     

                     అను తనకి కావలసిన హబ్బి ఎలా ఉండాలో నేను తయారు చేసిన "పిచ్చి నా కొండే"(మాట్లాడే కంప్యుటర్) లో ఫీడ్ చేస్తుంది. అందుకనుగుణంగా కంప్యుటర్ ప్రశ్నలడగడం ప్రారంబించింది.
పిచ్చి నా కొండే: నీ పేరు.
అను: అను
పిచ్చి నా కొండే: పేరు బాగుంది.
అను: థాంక్ యు. ఐన పేరు బాగుందా లేదా అని నిన్ను అడగలేదిపుడు. మాం..............ఛి బ్రాడ్ పిట్టంతటి వరుడి గురించి చెప్పు .అదీ చాలు.
పిచ్చి నా కొండే: ఏం పిట్ట, బ్రాడ్ పిట్టా? ఆ పిట్ట గురించి నేను ఎప్పుడు వినలేదే. అంటే విశా..............లమైన  పిట్ట అని అర్థమా?
అను: కామెంట్లు ఆపకపోతే కనెక్షన్ కట్ చేస్తా. అడిగింది చెప్పు ముందు.
పిచ్చి నా కొండే: జాతకాల మీద నమ్మకం ఉందా? ఏ నక్షత్రం వాడు కావాలి.
అను: తారక రత్న అనే నక్షత్రం తప్ప ఏ నక్షత్రం ఉన్న వాడైనా పర్లేదు.
పిచ్చి నా కొండే: సాఫ్ట్ వేర్ కావాలా, సినిమా వాడు కావాలా?
అను: ఎవడైనా పర్లేదు, అందగాడై ఉండాలి.
పిచ్చి నా కొండే: అమ్మాయి ఎత్తేంతో?
అను: '5 అడుగుల 2 అంగుళాలు'.
పిచ్చి నా కొండే: ఓ.కే. 'కొలతలు'
అను: వ్వాట్?
పిచ్చి నా కొండే: 'కొలతలు ప్లీజ్'. మీరు కోరుకున్న వరుడు రావాలంటే ఇది కంపల్సరీ.
అను: (అటు ఇటు రెండు వైపులా చూసి ఎవరు లేరని కన్ఫర్మ్ ఐన తర్వాత) కత్తి,కడల్,కాంబోజి.
పిచ్చి నా కొండే: ఓహ్ మా బాష లోనే చెప్పావా? పాపం చదివే వాళ్లకి అదృష్టం లేదన్న మాట."చాలా మంచి ఫిగరు".
పిచ్చి నా కొండే: 'పుట్టు మచ్చలు ఎక్కడేక్కడున్నాయ్'.
అను: నీకది అనవసరం.
పిచ్చి నా కొండే: లేదు అవసరమే.
అను: "రేయ్ పిచ్చి నా కొండే" ఇంకోసారి ఇలాంటి పనికి మాలిన చెత్త చచ్చు తేజ సినీమాల్లాంటి ప్రశ్నలేస్తే ఈ సెల్ఫ్ దిస్త్రక్షన్ బటన్ ప్రెస్ చేసి నీ పీక నొక్కుత.
 పిచ్చి నా కొండే: (చిన్న పిల్లాడిలా మారం చేస్తూ)ఊహు నాక్కావాలి, ఐ నీడు దట్టూ. లేకపోతే ముందుకు "గో"నంతే.
అను: సరే చావు.(కంప్యుటర్ బాషలో) కర్ కిష్ కోష్మ, అమ్మమ్మ ఉప్మా, బాలివుడ్ హీరోయిన్ కరిష్మా,తారక రత్నకు నైచరిష్మా. నితిన్ తో సినిమా,బుడ్డి పోయిన ఆలు ఖుర్మా,అదీ హీరోయిన్ల ఖర్మ, పైసల్ తిరిగి వస్తై అనేది నిర్మాతల భ్రమ..... ఇంత కంటే ఎక్కువ నేను చెప్పలేను బాబోయ్ నాకు సిగ్గేస్తుంది.      
పిచ్చి నా కొండే: అయితే నీ ఖర్మ. శరీర ఛాయా ఎలా ఉండాలి.
అను: నా నిగ నిగాలాడే జుట్టులో తిరిగే పేల మాదిరి గా నలుపైన పర్లేదు, ఆ పేల నివారణ కు నేను వాడే బెడ్ అండ్ శోల్దర్స్ షాంపూ లా తెలుపైన పర్లేదు.
పిచ్చి నా కొండే: అబ్బో చాలా గొప్ప పోలికే. ఇక్కడ కూడా నీ పేల గొడవ ఆపవా? ఇంతకి 'వాడు', సారి 'వరుడు'  సీరియస్ గా ఉండాలా? నవ్వుతు ఉండాలా?
అను: రెండు కలగలిపి. కొన్ని స్పెషల్ టైమ్స్ లో మాత్రం చిలిపి గా, అల్లరి గా 'అతడు' లో మహేష్ బాబు ల ఉండాలి.
పిచ్చి నా కొండే: ఇంకా నయం అవతార్ లో హీరో మాదిరి అన్నావ్ కాదు. వెదకలేక చచ్చేవాణ్ని.అవును స్పెషల్ టైమ్స్ అంటే.
అను: అవి మీ మిషన్లకి అర్థం కావు.
పిచ్చి నా కొండే: నన్ను మిషన్ అనొద్దు, నాక్కోపం వస్తుంది.కోపం వస్తే తెలుసుగా బాలయ్య సినిమా డౌన్ లోడ్ చేసుకుని చచ్చిపోతా.
అను: అయ్యా పిచ్చి నా కొండే గారు అంతా పని వద్దు కాని నాక్కాబోయే మొగుడి ఫోటో ప్రింట్అవుట్ ఇస్తే నేను వెళ్లి పోతా.
పిచ్చి నా కొండే:సరే ఆ 'బొలివియా అడవుల్లోంచి తప్పించు కొచ్చిన వింత గెలీలియో' ఫోటోలు.
అను: (కోపంగా) ఆ....
కంప్యుటర్: సారి నిన్ను "కొట్టుకోబోయేవాడి" (అయ్ బాబోయ్ అలవాటు లో పొరబాటు గా నిజాలోచేస్తున్నాయ్ ఏంటి), మళ్ళి సారి నిజాలు చెబుతున్నందుకు మీరు నన్ను క్షమించాలి.నిన్ను కట్టుకోబోయే మీ మొగుడి ఫోటో వస్తుంది కింద చూసుకోండి.
                                               

                  

                                                                                               

                         ఆ ఫోటో ని చూసిన అను పెళ్లి కాకుండానే వాంతులు చేసుకుని దానిక్కారణం నేను తయారు చేసిన " పిచ్చి నా కొండే" అని దానికి నష్ట పరిహారం గా తనకు నేను "అసలు అరవై వేల డాలర్లు, వడ్డీ వేయి బిలియన్ల డాలర్లు" చెల్లించాలని నన్ను కోర్టుకీడ్చింది. కోర్టు వారు వాదోప వాదాలు పరిశీలించిన అనంతరం ఆ ఫోటో చూసి మూర్చ పోయి ఇలాంటి సిల్లీ కేసు కోర్టు కు తెచ్చి కోర్టు వారి విలువైన సమయాన్ని వృధా చేసినందుకు "హైదరాబాద్ పీనల్ కోడ్ సెక్షన్ 007" కింద అంతే కాకుండా, ఆ ఫోటో చూపించి జడ్జి ల ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించినందుకు గాను "సెక్షన్ ఖైది నెంబర్ 786" కింద నన్ను, అను ని కొత్తగా కనిపెట్ట బడ్డ "ఈలపీటర్" అనే గ్రహాపు అడవుల్లో ఒంటరి గా వదిలి వేయాలని కోర్టు "గోచిగూడా"(పూర్వ కాలం లో దీన్ని కాచి గూడా అని పిలిచేవారట) 'అంతరక్షక భటుల్ని' ఆదేశించింది.

                     హైదరాబాద్ దేశ ప్రజల కోసం ఎన్నో వింతలు, విశేషాలు కనిపెట్టి, వారి కోసం ఎన్నో త్యాగం చేసిన ( ఆ మద్య నేను ఒక మంచి ఫీల్ ఉన్న కథ రాస్తానంటే లక్షల కొద్ది స్క్రాప్స్ పెట్టారు వద్దని, అలా కాదని రాస్తే బొందమూరి వంశస్తులతో  నన్ను కూడా సమంగా చూస్తామన్నారు. ఏదో అబిమానుల మాట కాదన లేక నేను కూడా రాయకుండా ఆగిపోయాననుకోండి, అదీ వేరే విషయం).నన్ను సాగనంపడానికి రాకెట్లకు రాకెట్లు జనం వస్తారనుకున్న. కానీ ఒక్కరు కూడా రాలేదు. మేబి నేను కనిపెట్టిన "కంప్యుటర్ లో కోతి కొమ్మచ్చి", "తోటల్లో తొక్కుడు బిళ్ళ" "గోలి మార్ గ్రహాల్ పార్" (గ్రహాల మీద గోలిలాట) అనే బ్రెయిన్ ట్విస్టర్ గేముల్లో బిజీ గా ఉన్నారేమో.

                      రాకెట్ బయలుదేరడానికి సిద్దంగా ఉంది.నేను, అను కూడా సిద్దంగానే ఉన్నాం, చేసేది ఏం లేదు కాబట్టి. కాని ఏం సమస్య వచ్చిందో తెలియట్లేదు, చివరి నిమిషం లో రాకెట్ మొరాయిస్తుంది. అస్సలు స్టార్ట్ కావట్లేదు.చాలా ప్రయత్నించాం. కాని లాభం లేదు. అంతలో అటు పక్కగా అలల మీద బజాజ్ కంపెనీ స్కూటోసాసర్ మీద వెళ్తున్నా ఒకతను మా అవస్థ గమనించి మా దగ్గరికి వచ్చాడు. మమ్మల్ని రాకెట్ లో కూర్చోమని చెప్పి రాకెట్ ని 45 డిగ్రీల కోణం లో కొద్ది గా కుడి వైపు కి వంచి కిక్ కొట్టాడు. ఆటోమాటిక్ గా అదీ స్టార్ట్ ఐపోయింది. ఎలా అని మేం అడిగేంత లోపే సింబాలిక్ గా తాను వాడే బజాజ్ స్కూటోసాసర్ వైపు చూపించాడు. ఇక మా ప్రయాణం పాలపుంతల సాక్షిగా, నక్షత్రాల మీదుగా గగన తల వీదుల్లోకి ప్రారంభమయింది. ఇంకా మేం చేరుకోవాల్సిన "ఈల పీటర్" కి కొద్ది దూరం మాత్రమే ఉంది.కాని ఆనందం మాకు ఎంతో సేపు నిలవలేదు. "బెనజీర్ జుట్టో" గ్రహం వాళ్ళు మేం వాళ్ళ పైకి దండెత్తి వస్తున్నామనుకుని మా మీదకి 2 మాన్ లెస్స్ క్షిపనుల్ని ప్రయోగించారు. అంతరిక్షం లో పెద్ద విద్వంసం.క్షణ కాలం పాటు అసలేం జరిగిందో అర్థం కాలేదు.
"డమాల్************** డిమేల్ ##############డిషుం@@@@@@@@@@@,దాడేల్"  
                                                                                                              
                               మీకు చదవాలనిపిస్తే (ఇంకా ఉంది) తదుపరి టపాలో....
                               మీ అభిప్రాయాల్ని కామెంట్ల ద్వారా తెలపండి.
               
  
             

10 comments:

  1. balakrishna movie download chesi chacchipota..lol.

    ReplyDelete
  2. "కత్తి,కడల్,కాంబోజి." wowwwwwwwwww

    ReplyDelete
  3. కస్క్రీమాపాదనిహీ = suman ( e tv )?
    am i right ?

    ReplyDelete
  4. @Appa Rao:

    DYK meaning of "కత్తి,కడల్,కాంబోజి"?
    Post is good.

    ReplyDelete
  5. @ కథ , స్క్రీంప్లే , మాటలు, పాటలు, దర్శకత్వం, నిర్మాత, హీరొ
    టపా..కత్తి,కడల్,కాంబోజి లా వుంది..:-)
    కాకపొతే.. ఈ శైలి ఎక్కడొ చదివినట్టుగా వుంది.. ఇంతకు ముందు వెరే పేరుతొ ఎమయినా రాసేవారా ?

    ReplyDelete
  6. కత్తి, కడల్, కాంబోజి :) :) :)

    నాదీ మంచుపల్లకీ గారి డౌటే, ఈ శైలి ఆల్రెడీ ఎక్కడో చదివినట్టుగా ఉంది. ఏదైతేనేం, కంటిన్యూ చెయ్యండి. మీ టపాలు సూపర్‌గా, సరదాగా, కామెడీగా, భళేగా ఉంటున్నాయి. :)

    ReplyDelete
  7. అచ్చంగా నూటపదహారు సార్లు నవ్వాను. మీకు నూటపదహారు థేంక్స్ లు

    ReplyDelete
  8. మీ టపా చలా నవ్వు తెప్పించింది. ఒక చిన్న వంశీ సినిమా చూసినట్లుంది. ఇంక మీరు మరిన్ని టపాలు రాయాలి.

    ReplyDelete
  9. adbhutam ga vundi.... Waiting for the next post....:)

    ReplyDelete
  10. @ వీరుభొట్ల వెంకట గణేష్: paina, madhya lo , kinda

    ReplyDelete