Thursday, January 28, 2010

ఆడపిల్ల..... అగ్గిపుల్ల..... సబ్బుబిళ్ళ

                        ఈ రోజు ఉదయమే అశ్విన్ గాడు ఫోన్ చేసాడు."రేయ్ బావ నేను నా స్వప్న (వాడి లవర్) గుళ్ళో కలుసు కోవాలనుకుంటున్నాం  రా. ప్లీజ్ రా నువ్ కూడా రా రా" అన్నాడు. నువ్వు నీ లవర్ "మెక్ డేవాల్ విస్కీ , బాగ్ పైపర్ సోడా లాగ మీరిద్దరూ కలుసుకుంటుంటే మధ్య లో కిన్లే వాటర్ బాటిల్ లా  నేనెందుకు రా, కిక్కు తగ్గి పోద్ది". వద్దు అన్నాను. వాడు వింటేనా? అర గంట డిస్కషన్ తర్వాత ఒకే ఒక్క డైలాగు తో నన్ను పడ గొట్టేసాడు ఎదవా. ఏంటి అంత పవర్ ఫుల్ డైలాగ్ అని అనుకుంటున్నారా? అదేం లేదు సిచువేషన్ కి తగ్గట్టు " రేయ్ హీరోలు ప్రేమిస్తే గుళ్ళలో కలుసుకోవడానికి సైడ్ కారెక్టర్లు అవసరం లేదు రా. కాని సైడ్ కారెక్టర్లు ప్రేమ లో పడితే మాత్రం తప్పకుండా హీరో పక్కనుండాలి రా. ఏమైనా అయితే ఫైట్ చేయాల్సింది నువ్వే కదా రా అన్నాడు.

                     నేనొక్కన్నే వెళ్తే నాకు బోర్ కొడుతుందని నేను నా కూడా ముగ్గురు ఫ్రెండ్స్ ని వేసుకుని ఒకే బైక్ మీద బయలు దేరాం. మధ్య లో ట్రాఫిక్ వాళ్లు పట్టుకున్నారు. ఈ మధ్య హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చాలా అడ్వాన్స్ అయ్యారు,డ్రైవింగ్ లైసెన్స్ ఏది,  సి బుక్ ఎక్కడ అని అడక్కుండా డైరెక్ట్ గా "తియ్ డబ్బులు తియ్" పర్సు ఏ జేబులో ఉంది అని అడుగుతున్నారు. అర గంట సేపు నిల్చోబెట్టి, 500 రూపాయలు ఫైన్ వేసి చివరికి దిక్కులు చూస్తూ యాబై రూపాయలు జేబులో పెట్టుకుని మమ్మల్ని వదిలాడు.             

                    గుళ్ళో ఆ జంట "నువ్ షారుక్ ఖాన్ అంటే నువ్ కాజోల్" అని, "నువ్ హృతిక్ అంటే నువ్ పడుకునే దీపిక" అని, "నువ్ తారక రత్న అంటే నువ్ విజయ శాంతి" అని ఓ.........ఒకటే పొగిడేసుకుంటున్నారు ."కొత్త బ్లాగరు కు పొద్దేరగదన్నట్టు" వీళ్ళకి టైం తెలియదు కొత్తగా ప్రేమ లో పడ్డారు కదా........

                    వాళ్ళ గోల బరించలేక "దుమ్ము కొట్టుకుపోతున్న మా ఫ్రెండ్స్ దమ్ము కోడతానంటే "సరే అని వాళ్ళని తీసుకుని  గుడి బయట ఇరానీ కేఫ్ కి వెళ్ళాను.( సిగరెట్ కి డబ్బులు నేను అశ్విన్ గాడిని, అశ్విన్ గాడు వాడి గాల్ ఫ్రెండ్ ని ఏ మాత్రము అడగలేదని మీరు అర్థం చేసుకో గలరు) కేఫ్ లో చాయ్ ఆర్డర్ చెప్పి కూర్చున్నాం. మా ఫ్రెండ్ సిగరెట్ వెలిగించి ఒక్క దమ్ము లాగి " రేయ్ మామ సరదాగా ఒక గేమ్ ఆడదాం రా బోర్ కొడుతుంది అన్నాడు. గేమ్ ఏంటంటే ఒక్కొక్కడు ఒక్కో లక్కీ నంబర్ చెప్పాలి. ఆ నంబర్ ప్రకారం గుడి నుండి బయటికొచ్చే ఆ నంబర్ అమ్మాయి తో మాట్లాడాలి. ఎవరైతే  మాట్లాడకుండా  ఓడిపోతారో వాడు మందు పార్టీ ఇవ్వాలి. కొంచం రిస్క్ ఐనా అందరం ఓ.కే అనుకున్నాం.

                    ముందు గా మా ధర్మెంధర్ గాడు చెప్పాడు. "నాలుగు" అని చెప్పి గుడి మెట్ల మీద నిల్చున్నాడు వచ్చే అమ్మాయి తో మాట్లాడడానికి. అమ్మాయి రాగానే షర్ట్ విప్పి చంక లో పెట్టుకుని నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని "అమ్మా ...........కళ్ళు లేని కబోది ని తల్లే............ఓ వంద రూపాయలుంటే ధర్మం చేయి తల్లే.........నీకు సాఫ్ట్ వేర్ మొగుడు ఒస్తాడు చెల్లీ ............అని అడుక్కోవడం మొదలు పెట్టాడు. పాపం ఆ అమ్మాయి కి కూడా జాలేసి వీడికో కొబ్బరి ముక్క, కొంచం ప్రసాదం పెట్టి వెళ్లి పోయింది.
ఎలాగైతే ఏంటి వాడు తప్పించుకున్నాడు. 
             
                      నెక్స్ట్ నేనే. నా లక్కీ నంబర్ "ఒకటి". వచ్చే అమ్మాయి కోసం మెట్ల మీద టెన్షన్ గా వెయిటింగ్.  వైట్ చుడిదార్ లో  పుష్పాలు తాకి  కంది పోయేట్లున్న పాదాలు వడి వడి గా అడుగులేసుకుంటూ గుడి బయటకు రావడం మొదలు పెట్టాయి.నంది వర్ధనం పుష్పం లా ఉంది అమ్మాయి, నాకేం చేయాలో పాలు పోవట్లేదు.

                       ఆమె సరా సరిగా నా దగ్గరికే వచ్చి "హలో" అంది. ఆ గొంతు "తాన్సేన్" వయోలిన్ నుంచి వచ్చిన రాగమంత తీయగా ఉంది. ఆమె ఏదో చెప్తుంది కాని నాకు ఆ మాటలేవి అర్థం కావట్లేదు కాని బాగ్రౌండ్ లో అరరే..... అరరే...... మనసే... జారే. అనే పాట మాత్రం  వినబడుతుంది.. నేను అల్రడి ఆమె అందానికి బోల్డ్. ఆమె నా చేయి పట్టుకుని గుడి లోపలి తీసుకెళ్తుంది.కాని నేను ఏమి అర్థం చేసుకునే స్థితి లో లేను, నేను అన్ కాన్షియస్. నన్ను గుడి కొలను లోకి తోసేసిన తర్వాత గాని నేను ఈ లోకం లోకి  రాలేదు.

                    నేను సెట్ అయిన తర్వాత అశ్విన్ గాడు అక్కడే నాకు పరిచయం చేసాడు ఆమెని, "she is swapna's friend  హహ హ్హా అను " అని.

హహ హ్హా హాసిని కదా! హహ హ్హా అను ఏంటి? ఐనా "తోక లో ఈక, పవన్ కళ్యాణ్ సినీమా లో డైరెక్టర్"  తొక్కలోది..... ఏదైతే మనకేంటి. మనకు మాత్రం "హహ హ్హా అను". 'అను' వాటే గుడ్ నేమ్. "అనే కొద్ది అనాలనిపిస్తుంది అను అను అని".

                    ఇక అక్కడ నుండి మొదలు అశ్విన్, స్వప్న ఎప్పుడు కలుసుకున్న "వీడికి తోడు నేను", "ఆమె కి తోడు అను".ఒకటే సినిమాలు, షికార్లు, పార్కులు,ఐస్ క్రీమ్ పార్లర్లు. పిజ్జా కార్నర్ (జీతం ఫట్టు), పంజా గుట్ట సెంట్రల్ (చైను తాకట్టు), ఐ మాక్స్ (ఈ సారి ఉంగరం)  ఎక్కడ చూసినా మేమే. అంతకు ముందు నెలకి మినిమం ఐదు వేలైనా  సేవింగ్స్ కోసం బ్యాంకు లో కట్టే వాణ్ని, ఆఫ్ కోర్స్ ఇప్పుడు కూడా కడుతున్నాను అనుకోండి, కాని బ్యాంకు లో కాదు. అప్పుల వాళ్లకి వడ్డీ.ఆ వడ్డీ లానే  మా పరిచయం కూడా పెరిగి పెద్దదై మంచి స్నేహంగా మారింది.

                     కాని తనతో ఒక్కటే చిక్కు. తాను ఏ సినీమా చూసినా ఆ హీరోయిన్ కారెక్టర్  లో లీనమై పోతుంది. ఆ మధ్య నేను అను దేవదాస్ సినీమా కి వెళ్ళాం. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ బాగానే సాగింది. దాంట్లో హీరో హీరోయిన్ పెర్మిషణ్ లేకుండా ముద్దు పెట్టుకునే సీన్ ఉంటుంది. అలా అక్కడ ఆ సీన్ అయిపోయిందో లేదో..... చాచి ఒక్కటిచ్చింది. దెబ్బ కి మెగా స్టార్, పవర్ స్టార్ సూపర్ స్టార్ అన్ని స్టార్స్ కనబడ్డాయి. పైగా డైలాగులోకటి "ఛీ వెధవ నువ్ ఏదో మంచి వాడివని నీతో వస్తే ఇలా చేస్తావా" అని. ఇంకేముంది, కేవలం  కొన్ని సెకన్ల వ్యవధి లో నన్ను షేపులు  మార్చి థీయేటర్ అవతల చెత్త కుప్ప పక్కకి పడేసారు. పక్కకి టీ కొట్టు వాడి ఎఫ్.ఏం లో పాటోస్తోంది కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్..... ఓడి పోలేదోయ్.....................".           

                     మెల్లిగా నేను అను ని ఇష్టపడుతున్నాననే విషయం అశ్విన్ కి వాడి గాళ్ ఫ్రెండ్ కి కూడా అర్థమయింది.రాను రాను........వోడాఫోన్ యాడ్ లో డాగ్ లా తయారయింది నా పరిస్థితి. దాంట్లో కూడా ఇంతే ఆ కుక్క ఎందుకు ఫాలో అవుతుందో, ఆ పాప కి తెలీదు, కాని చూసే ప్రేక్షకులకి మాత్రం మెసేజ్ రీచ్ అవుతుంది. అర్థం కావాల్సిన వాళ్లకు అర్థం కాకుండా వేరే వాళ్లకి అర్థమవుతుంది నా లవ్ స్టొరీ. అలా ఆరు నెలలు గడచింది.           

                        ఈ విషయం లో ఎవరైనా ఎక్స్పర్ట్ సలహాలు తీసుకుంటే బెటర్ అనిపించింది నాకు, వెంటనే అశ్విన్ గాడికి ఫోన్ చేశా. కాలర్ ట్యూన్ వినబడుతుంది "ఇది తొలి రాత్రి.. చెరగని రాత్రి, ఊర్వశి రావే.............ప్రేయసి పోవే"  అని. ఎంత సేపు చేసినా......  రింగ్ అవుతుంది కాని ఎత్తట్లేదు, మళ్ళి మళ్ళి అదే పాట రిపీట్.

రింగ్ వస్తేనే "మార్తాండ బ్లాగు లో కామెంట్ పెడితే, రిటర్న్ కామెంట్ వచ్చినంత ఫాస్ట్ గా" ఫోన్ ఎత్తే అశ్విన్ గాడు ఇలా చేస్తున్నాడు అంటే సమ్ థింగ్ రాంగ్.

 డైరెక్ట్ గా అశ్విన్ గాడి రూం కెళ్ళి చూసే సరికి ........................

ఒక ఫుల్ బాటిల్, మూడు, నాలుగు ఖాళీ బీరు సీసాలు అక్కడక్కడ పడున్నాయ్. వాడు తాగి పాటలు పాడుతున్నాడు. థూ........పాకి పాకి పర దేశి....................అని.

"పాకి.. పాకి.. పరా దేశి, ఉరికి ఉరికి  స్వదేశీ" ఏంటి రా? అసలు మాటర్  ఏం జరిగింది. చెప్పరా. కాని వాడు నా మాటలు వినట్లేదు...మళ్ళి ఇంకో పాటందుకున్నాడు.

ఎవరి కోసం... టా.. ట్టాడ..డ.. డం .....
ఎవరి కోసం టా ట్టాడ... డం...
ఈ ప్రేమ మందిరం ఆ దేవ నందనం,
ఆ గ్రీటింగ్ కార్డు.....ట. డ డ టా డ డ డా.. ఈ సెల్లు గిఫ్టు టా ట్ట డ .. డ.. డాం........
( ఆ తర్వాత పాట రానట్టుంది ఇంకో పాట అందుకున్నాడు)

ఉన్నావా................... అసలున్నావా ? ఉంటే  బీరు తాగి పడుకున్నావా.................. ఉన్నావా?.......................ఉన్న్నావా..................

ఇలా అయితే లాభం లేదు "ముళ్ళు ని ముళ్ళు తోనే తీయాలి, సెల్లు ని సెల్లు తోనే మోగించాలి" అని ఒక బీరు కొట్టి నేను కూడా ఒక పాట అందుకున్న.......
.ముస్తఫా ముస్తఫా.... డోంట్ వర్రి ముస్తఫా.......
నేనే నీ నేస్తం ముస్తఫా........

అప్పుడు గాని "దెబ్బకి మార్తాండ దిగి" వాడు ఈ లోకం లోకి రాలేదు.అప్పుడడిగాను 'ఇప్పుడు చెప్పరా అసలు నీ బాధేంటి? ఈ బాటిల్సేంటి' అని. వాడు ఒక్క ముక్క లో రెండు  చెప్పేసాడు "రేపే స్వప్న కి పెళ్లి, నాకు చావు" అని.

                    సీన్ కట్ చేస్తే పెళ్లి కూతురు ఎవరితోనో లేచి పోయిందట అని పెళ్లి మంటపం లో అమ్మలక్కలు అందరు చెవులు కొరుక్కుంటున్నారు...........స్క్రీన్ లో ఒక వైపు ఈ సీన్. ఇంకో వైపు నేను పెళ్లి కొడుకు వేషం లో  స్వప్న ని తీసుకుని పరార్.ఈ సీన్ స్క్రీన్ లో మరో వైపు.....ఇప్పుడు స్క్రీన్ మీద టైప్ కొడుతూ  D i r e c t e d... By... K i s h o r e  అనే అక్షరాలు.

                               *********ఇక్కడ ఇంటర్వెల్ బాంగ్*********  

                     సంఘి టెంపుల్ లో స్నేహితుల సమక్షం లో అశ్విన్ కి స్వప్న కి పెళ్లి జరిపించి 'అను' వాళ్ళింట్లో నే దాచి పెట్టాం కొన్ని రోజుల పాటు (మా బాచ్ అంత కూడా వాళ్ళింట్లోనే ఉన్నాం). అను వాళ్ళ అమ్మ గారి అరిసెలు, (నాన్న గారు చిన్నపుడే  సులువు గా ఉంటుందని ప్లాస్టిక్ బకెట్ తన్నేసారు) బామ్మ గారి తిట్లు, తమ్ముడి అరివీర బయంకర కాట్ల మధ్య లో అను పుట్టిన రోజు వచ్చింది.  ఈ సారి బైక్ వంతు.

                       నెక్స్ట్ సీన్ లో..... నేను ఇరవై రెండు వేలు, షాపు వాడు ఇరవై వేలు....  ఇరవై రెండు, ఇరవై. ఇరవై రెండు, ఇరవై, ఇరవై రెండు, ఇరవై చివరికి ఇరవై కే ఖాయమయింది. నేను డబ్బుల్లెక్క పెట్టుకుంటున్నాను. "రేయ్ చచ్చు వెధవ........ అమ్మాయి కోసం నన్నే అమ్మేస్తావా. నేను బాగున్న రోజుల్లో లీటర్ కి ఎనభై ఇచ్చాను కదా రా. నువ్ తాగి నడిపినా ఆ కంపు బరించానే కాని ఏ ఒక్క రోజైనా కింద పడేసానట్రా ? "విశ్వాసం లేని బైకర్", క్రాకర్, జోకర్ ఇంకా ఎక్కువ మాట్లాడితే  "ఇండియన్  క్రికెట్ జట్టు లో అజిత్ అగార్కర్". నువ్వు బాగు పడవు రోయ్, నెక్స్ట్ నీకు వచ్చే బండి లీటర్ కి ఇరవయే ఇచ్చే మంచి తాగుబోతు దొరుకుతుంది రా ఇదే నా శాపం" దూరంగా నా బైక్ నన్ను తిడుతుంది.

                      చివరి సారి గా నా బైక్ దగ్గరికి వెళ్లి "నా కష్టాలు చెప్పుకోవడానికైన, తీర్చుకోవడానికైనా నాకు నువ్ తప్ప ఇంకేవరున్నారే...... అందుకే అమ్మేసా.. ఈ జన్మ కే కాదు వచ్చే జన్మ జన్మ కి నువ్వే నా బైక్ గా పుట్టాలి" అని ఒక సెంటిమెంటల్ టచ్ ఇచ్చా.......... అంతే అది గుండె పగిలి  పెట్రోల్ కారుస్తూ కింద వాలి పోయింది.


                                                              
                  అర్ధ రాత్రి పన్నెండు గంటలకు షురూ పుట్టిన రోజు హంగామా........ ఫుల్ హల్ చల్...  కేక్ కట్టింగ్, పాటలు, డాన్సులు డ్రింక్స్  అంతా హంగామా హంగామా. టైం తెల్లవారి నాలుగు అవుతుంది.అందరు బోల్డ్. నేను, అను మాత్రమే మెలకువ గా ఉన్నాం. నేను అను కళ్ళల్లోకి చూస్తున్నాను. నాకు అను కి మధ్య మౌనం........

                     ఆ మౌనాన్ని అను "మాంచి బాటా చెప్పు "తో కొట్టి తరిమేస్తూ "ఆక్స్ స్ప్రే కొట్టుకున్నవా?" అని అడిగింది. నేను లేదు అన్నట్టు గా తల అడ్డంగా ఊపాను.  అంతే,  అను ఒక్క సారిగా లేచి నన్ను కౌగలించుకుని గట్టిగా ఏడ్చింది. "మా నాన్న గారు చని పోయిన తర్వాత ఏ ఒక్క రోజు ఇంత సంతోషంగా గడపలేదు. చాలా రోజుల తర్వాత మా ఫామిలీ కళ్ళల్లో  సంతోషం  చూసింది ఈ రోజే. ఇదంతా కేవలం నీ వల్లే....... నిజంగా కిషోర్ ఇక పై నేను నిన్నోదులుకో లేను". కాని...................అంటూ తన  "మెరుపు వెనక కథ"  ( ఫ్లాష్ బ్యాక్ స్టోరి ) చెప్ప సాగింది అను.

                      "నాకు.... నాకు.... ఇంతకు ముందే  పెళ్లి అయిపోయింది."
 
ఈ మాట వినగానే ఒక్క సారిగా, ఎక్కడో......... ఉన్న  వైజాగ్  సముద్ర తీరాన ఎగిసిన అల అలానే నిలిచి పోయింది. ఆకాశం లో పక్షులు ఆగి పోయాయ్,నేల మీద చెట్లు గాలికి కదలడం ఆపేశాయి.    

                        'మా నాన్న తన్నాల్సిన బకెట్ చాలా దగ్గర లో మా ఇంటి బాత్ రూం లోనే ఉంది అని తెలియటం తో ఆయన కాలు బాల్చి తన్నే ముందే ఉన్న ఒక్క కూతురు అత్త వారింట్లో కాలు జారాలని  పన్నెండు సంవత్సరాల వయసు లోనే  నా  పెళ్లి జరిపించారు'. ఆ తరువాత మా వారు స్నానానికి అని పెట్టుకున్న బకెట్  మా నాన్న గారు తన్ని  చని పోవడం, నా బకెట్ నే తంతారా?  అని మా వారు గొడవ పెట్టడం తో మా  రెండు కుటుంబాల మధ్య "పచ్చ గడ్దేస్తే పది వేల మందికి భోజనం ప్రిపేర్ చేసేంత" అగ్గి రాజుకోవడం తో   నన్ను మా  పుట్టింటికి పంపించేసారు".         

                      పూర్తి గా వినగానే మళ్ళి అన్ని యదా స్థితి కి వచ్చేసాయ్.(అంటే  వైజాగ్ సముద్ర తీరాన ఎగిసిన అల, ఆకాశం లో పక్షులు,నేల మీద చెట్లు అన్న మాట). నేను కూల్ గా "అంతే కదా నో ప్రోబ్లం " నేను ఊళ్ళో అమ్మ, నాన్నకి చెప్పి ఒప్పించి తీసుకొస్తా అని చెప్పి  ఊరికెళ్ళి పోయాను.

ఇంటి దగ్గర.....................

మొదటి రోజు " పెళ్లి అంటే మార్తాండ బ్లాగు అనుకున్నావ్ రా ఇలా ఓపెన్ చేసి అలా విండో క్లోజ్ చేయడానికి". అది రాజమౌళి సినీమాలో కత్తి రా!  సినీమా అయి పోయేంత వరకు దాన్ని డిజైన్లు డిజైన్లు గా చేసి  జాగ్రత్త గా వాడుకోవాలి". నీకు ఆట లా ఉంది  రా?" ఎక్కువ మాట్లాడితే ఆ కత్తి తోనే నీ తోలు తీస్తాం.

ఇంకేముంది నేను "జై కె.సి ఆర్"..... "జై జై లగడ పాటి"..........  

పదవ రోజు "సరే నీ ఇష్టం వచ్చినట్టే తగలడు గాని ఆ దొంగ నిరాహార దీక్ష ఆపు, చూడ లేక చచ్చి పోతున్నాం ఇక్కడ "
                   
                    ఎలా అయితే ఏంటి అమ్మ, నాన్నల్ని ఒప్పించాను. సంతోషం తో ఈ విషయం అను కి చెబుదామని హైదరాబాద్ బయలు దేరాను. "వీడేప్పుడు బయలు దేరుతాడా... వీడికెప్పుడు ఎదురు వద్దామా అని  రోజూ  వేచి చూసే మా వీధి  నల్ల పిల్లులన్ని కూడా పని గట్టుకుని ఏదో స్ట్రైక్ లో పాల్గొంటున్నట్టున్నాయి". ఈ రోజు నాకు ఒక్కటి కూడా నాకెదురు పడలేదు. ఇక అంతా శుభమే...
           
                       అను వాళ్ళ ఇంటికి వెళ్ళే సరికి అంతా పండగ వాతావరణం లాగా ఉంది. ఇల్లంతా అలంకరణ తో........సందడి గా ఉంది. నన్ను చూడ గానే అను వాళ్ళ అమ్మ గారు ఆప్యాయంగా పలకరించారు"ఎలా ఉన్నావ్ బాబు రా కూర్చో ,ఊళ్ళో అమ్మ నాన్న అంతా కులాసా నా?" అని. కాని నేను ఆ మాటలు వినట్లేదు నా కళ్ళు అను కోసం వెతుకుతున్నాయ్. అంత లో అటు గా వెళ్తున్నా ఒకతన్ని పిలిచి పరిచయం చేసింది."ఇతని పేరు కమల్, అను భర్త. అను ని కాపురానికి తీసుకెళ్ళడానికి వచ్చాడు" అని.

                        నాకు ఒక్క సారి గా ప్రపంచం స్తంభించి పోయినట్టు అనిపించింది. అటు వైపు గా వస్తున్న అను నన్ను చూసి అప్రయత్నంగా తలుపు చాటుకి వెళ్లి పోయింది. నాకు దూరంగా కన్నీటి తో తడిసిన అను పాదాలు మాత్రమే కనబడుతున్నాయి. ఇంకా ఎక్కువ సేపు అక్కడ ఉండడం మంచిది కాదు అనిపించింది.

ఎక్కడున్నా తను హ్యాపీ గా ఉంటే చాలు అనుకుని వచ్చేసాను తనకి దూరంగా...........
కాని నేను కోరే ఏ కోర్కె ని తీర్చని దేవుడు ఈ కోర్కె ని కూడా తీర్చ లేదు.......
సరిగ్గా రెండు నెలలకి తెలిసింది, అను కాపురానికి వెళ్ళిన మరుసటి రోజే  ఆత్మ హత్య చేసుకుందని....................

మగవాళ్ళం మనం  ఏదో........ ప్రేమించేసాం అనుకుంటాం కాని ప్రేమించే విషయం లో మనం ఆడ వాళ్ళ కంటే  తక్కువే...........   

ఆడపిల్ల..... అగ్గిపుల్ల..... సబ్బుబిళ్ళ (టైటిల్ జస్టిఫికేషన్) ఇవన్నీ వేరొకరి కోసం తమ జీవితాన్ని త్యాగం చేసేవే...........    

20 comments:

  1. papam anavasarnga aa amamyi ni champesav.......... entha sadism

    ReplyDelete
  2. నేను ఫస్టు టైమరు మీ బ్లాగు కి. బ్లాగు బాగుందండీ.. టైటిల్ లో కధ,స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, దర్సకత్వం... వరకు అర్ధం అయింది. ని హీ అంటే ఏంటండీ? ప్లీజ్ చెప్పరూ!

    ReplyDelete
  3. @ simple soul

    నా బ్లాగుని సందర్శినందుకు ధన్యవాదాలండి. హీ అంటే హీరో .

    ReplyDelete
  4. అంతా కామెడీ గా తీసి...చివరికి tragedy చేసేసారు...

    I hope this is not a true story!

    ReplyDelete
  5. ante miru bane undali........ ammayi matram povala...... malli miru chakaga pelli chesukuntaru. happy ga untaru entha sadistic ga think chesarandi...... happy ga anu ni valla husband tho kalapochuga

    ReplyDelete
  6. @ చైతన్య

    ఇది నిజంగా ట్రూ స్టోరి నే చైతన్య గారు. దాంట్లో ప్రేమ, అమ్మాయి కి చిన్నపుడే పెళ్లి జరగడం, చివరికి ఆ అమ్మాయి చని పోవడం అంతా నిజమే. బట్ ఇది నా స్టోరి కాదు. మా ఫ్రెండ్ స్టోరి. నేనే దానికి కామెడి పూత పూసాను.

    ReplyDelete
  7. :-) :-)..చాలా బాగుంది...కైమాక్స్ కూడా కామేడీగా చెప్పి ఉంటే బాగుండేది.

    ReplyDelete
  8. 100 days pakka.... ani chebudamanu kunnanu....chadi ve tappudu... kani climax tragedy ipo indi...change cheyyavalasindandi...
    real story annaru kabatti comedy lekundaa.. serious ga raasi undavalasindi....

    good one....

    ReplyDelete
  9. >>"ఎక్కడున్నా తను హ్యాపీ గా ఉంటే చాలు అనుకుని వచ్చేసాను తనకి దూరంగా."

    వచ్చేముందు అనుతో కనీసం ఒక్కమాటయినా మాట్లాడుంటే, ఆమె జీవితం నిలబడేదేమో. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారా? ప్చ్... మీరు అనవసరంగా ఒక ప్రాణాన్ని బలితీసుకున్నారు. మీమీద కేసెయ్యాలి. (ఇక్కడ మీరంటే మీరు కాదు, మీరు రాసిన దాంట్లో ఎవర్ని అనుకున్నారో వాళ్ళని).


    ట్రాజెడీ, పక్కన పెట్టేస్తే, మార్తాండ మీద డైలాగులు కేక. ఈ మధ్య మార్తాండ మీద డైలాగులు రాస్తున్నారు. ఇంతకీ, ప్ర.నా. అన్నాయ్ మిమ్మల్ని ఎప్పుడు కెలికాడు. :)))

    ReplyDelete
  10. ఆడపిల్ల..... అగ్గిపుల్ల..... సబ్బుబిళ్ళ (టైటిల్ జస్టిఫికేషన్) ఇవన్నీ వేరొకరి కోసం తమ జీవితాన్ని త్యాగం చేసేవే...........

    నిజం చెప్పారు. వేరొకరి కోసం తమ జీవితాన్ని త్యాగం చేసే ఆడవాళ్ళని నా జీవితంలో చాలామందినే చూశాను. పాపం అనిపిస్తుంటుంది. నిస్సహాయతతో, జాలి పడటం తప్ప చెయ్యగలిగింది ఏమీ లేదు. కొన్ని జీవితాలంతే. ప్చ్...

    ReplyDelete
  11. హ్మ్. మరో ఆడపిల్ల కథాంతం అయిపోయిందన్నమాట. ప్చ్.

    ReplyDelete
  12. @శేఖర్ పెద్దగోపు
    @పరిమళం
    @నాగప్రసాద్
    @venuram
    @budugu
    ధన్య వాదాలండి.
    కైమాక్స్ కామేడీగా చెబుదాం అంటే ఇది నిజంగా జరిగింది కాబట్టి అలా చెప్పలేక పోయా.... పోనీ పూర్తి గా సీరియస్ గా చెబుదామంటే చదివే వాళ్లకి బోర్ కొడుతుంది. అందుకే రెంటినీ సమానంగా హాండిల్ చేద్దామని ట్రై చేశా.
    @నాగప్రసాద్
    'మార్తాండ అన్నయ్య' ఎవరిని గెలక్కుండా ఉంటాడన్నయ్య. ఆయనసలే ఇప్పుడు "బ్లాగు లోకపు బాలయ్య".

    ReplyDelete
  13. Aboo!!!! mee ee post lo chala information unid mastaruuu..

    ReplyDelete
  14. Hey..story chana intresting ga vunnadi. Actual ga nenu kadhalu,blogs chadavanu. emoo mari mee chinna story chadivina. kaani upset aiena. kadha kick kosam champinaru adi okate bagaledu. oka doubt sudden gaa anu ni attagari intiki ela vellindhi? vallaki godavalu kada?????????

    ReplyDelete
  15. @ Anonymous.

    ధన్య వాదాలండి.
    కథలు, బ్లాగులు చదవని మీ చేత నా టపా మిమ్మల్ని మొత్తం చదివించేలా చేసింది అంటే నేను ధన్యుణ్ణి.

    ReplyDelete
  16. This comment has been removed by the author.

    ReplyDelete
  17. లొల్లి ...బాగా రాసినవ్ భయ్.. జన్మతహ నాది కూడా రామగుండం .. ఉద్యోగ రీత్య ప్రస్తుతం పూణెలో ఉంటున్నాను ..

    ReplyDelete