Thursday, January 21, 2010

దోస దొంగనాథ్ గారి "బద్మాష్ బాడుకావ్"

                   ఈ రోజు ఉదయాన్నే ఆరు గంటలకే నిద్ర లేచి ఎంత దగ్గరైతే అంత తాజదనాన్నిచ్చే "ఉప్పు లేని టూత్ పేస్టు" తో పళ్ళు తోముకుని చాలా హుషారుగా ఈల పాటలు పాడుకుంటూ సినీ తారల సబ్బుతో స్నానం ముగించి, అమ్మాయిలంతా నా వెంట బడేట్టు "ఆక్స్" స్ప్రే కొట్టుకుని నేను ముచ్చట పడి కొనుక్కున్న సూట్ వేసుకుని రెడీ అయ్యాను. ఏంటి పది గంటలకు కాని నిద్ర లేవకుండా, పళ్ళు తోముకోకుండానే  ఆఫీస్ కి వెళ్ళే కిషోర్ ఏంటి, ఇలా రెడీ అవడం ఏంటి అనుకుంటున్నారా? ఆఫీస్ కి అయితే అలాగే వెళ్ళే వాణ్ని. కాని ఇప్పుడు వెళ్ళేది ఆఫీస్ కి కాదు."బద్మాష్ బాడుకావ్" షూటింగ్ కి. ఆ టైటిల్ ఏంటి అనుకుంటున్నారా? మీకు తెలుసు గా మన డైరెక్టర్ "దోస దొంగనాథ్" గారికి "తిట్ల సెంటిమెంట్" ఉందని.

                     నైట్ పడుకునే ముందు బాస్ దగ్గర నుండి మెసేజ్ వచ్చింది. ఏంటి అని చూసుకునే సరికి " kishore sharply 8 'o' clock you have to be at "బద్మాష్ బాడుకావ్" shooting spot" అని ఉంది. ఎన్నో రోజుల నుండి అనుకుంటున్నా సినీమా షూటింగ్ ఎలా ఉంటుందో చూడాలని. ఇప్పటికి చాన్స్ దొరికింది. అన్నట్టు ఆ సినీమా యూనిట్ ని ఇంటర్వ్యూ చేసేది కూడా నేనేనండోయ్.మా ఆఫీస్ కార్ వచ్చి నన్ను రిసీవ్ చేసుకుని కరెక్ట్ గా ఎనిమిది గంటలకి నన్ను "బద్మాష్ బాడుకావ్" షూటింగ్ స్పాట్ దగ్గర దిగబెట్టింది.


                                                                      

                      అక్కడ షూటింగ్ జరగట్లేదు.మెయిన్ ఆర్టిస్టులంతా మేకప్ తో రెడీ గా ఉన్నారు. షూటింగ్ కి కావలసిన ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయ్, జూనియర్ ఆర్టిస్టులంతా గుంపులు గుంపులు గా చేరి మాట్లాడుకుంటున్నారు.స్టంట్ మాస్టర్ వాళ్ళ శిష్యులతో అంటున్నాడు, ఛా ఎప్పుడు ఇలా కాదే, ఏంటి ఇలా అయింది? అని. అందరి ముఖాల్లోనూ ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా ఎవరి గురించి వెయిటింగ్ అని నేను అనుకుంటుండగానే దూరం నుంచి ఒక యూనిట్ బాయ్ పరుగెత్తుకుంటూ వచ్చి మోస పోస్తూ "సార్ టిఫిన్స్ వచ్చాయ్, రండి" అని అనగానే సినిమాకి లక్షల్లో రేమునరేషన్ తీసుకునే మెయిన్ ఆర్టిస్టులతో సహా అందరు "రెండు రూపాయలకే  కిలో బియ్యానికి"ఎగ బడ్డట్టు ఎగబడ్డారు." వార్నీ దీనికోసమా అప్పటి నుండి పనులన్నీ ఆపి టెన్షన్ గా ఎదురు చూస్తుంది"

                       ఇంతలో అక్కడికి ఆ సినిమా కి పని చేసే పేరు పొందిన ఒక "మేకప్ మెన్" వచ్చాడు. నేను మేకప్ మెన్ ముందు మైక్ పెట్టి "సర్ ఈ చిత్రానికి మీరు హీరో గారికి హాలివుడ్ రేంజ్ లో మేకప్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది కేవలం హీరో గారి హెయిర్ స్టైల్ కే కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నట్టు వినికిడి ఇది నిజమేనా సర్" అని అడిగాను. దానికి ఆ మేకప్ మెన్ "yeah yeah sure. just now i will show u" అని చెప్పి అక్కడే ఉన్న హీరో కి ఒక "గార్నియర్ షాంపూ యాడ్ లో మోడల్ పెట్టుకునే విగ్ ఒకటి పెట్టి, "సన్నటి బొంత పురుగు" లాంటి పిల్లి గడ్డం (ఫ్రెంచ్ బెయర్డ్) ఒకటి మూతి కింద తగిలించి ఇదే హీరో గారి మేకప్, చాలా డిఫరెంట్ గా ఉంది కదూ అసలు ప్రేక్షకులేవరు గుర్తు పట్టరు. దీని కోసమే హీరో గారు,నేను 30 డేస్ హాలివుడ్ లో తర్ఫీదు తీసుకుని వచ్చాము". అని చెప్పాడు. నేను పక్కకి తిరిగి చూసే సరికి నిర్మాత నెత్తి మీద తడి బట్టేసుకుని ఒక నవారు చైర్ లో కూర్చుని ఉన్నాడు. పాపం నిర్మాత ని చూస్తుంటే మేకప్ మెన్ చెప్పింది నిజమే లాగుంది.               

                     అప్పుడే నిర్మాత ఆ చైర్ లోంచి లేచి "డైరెక్టర్" తో ఇప్పుడు తీయ బోయే సీన్ ఏంటి అని అడిగాడు. డైరెక్టర్ తీవ్రంగా ఆలోచించి "హే అప్పా రావు ఇట్రా" అని తన అసిస్టెంట్ డైరెక్టర్ ని పిలిచి,"జస్ట్ ఫైవ్ మినట్స్" అని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్ ని వెంటబెట్టుకుని "అన్ని సౌకర్యాలున్న ఒక లక్సరీ షూటింగ్ బస్సు (మేకప్ కారవాన్) లోపలి కి తీసుకెళ్ళాడు. కొద్ది సేపటి తర్వాత బయటికి వచ్చి "ఆ సర్ షాట్ రెడీ" అని చెప్పి కెమెరా మెన్ ని పిలిచి సీన్ చెప్పి లైటింగ్ ఎలా సెట్ చేద్దాం, షాట్ ఏ యాంగిల్ లో తీద్దాం అని అడుగుతున్నాడు. అప్పుడు కెమెరా మెన్ "హే సుబ్బా రావు ఇట్రా" అని తన అసిస్టెంట్ ని పిలిచి,"జస్ట్ ఫైవ్ మినట్స్" అని చెప్పి తన తో పాటు తీసుకుని మళ్ళి అదే బస్సు లోకి వెళ్ళాడు.


                                                                             

                       నాకెందుకో డౌట్ వచ్చింది "ఎవరు ఎవర్ని ఏం అడిగిన "జస్ట్ ఫైవ్ మినట్స్" అని చెప్పి ఆ బస్సు లోకే వెళ్తున్నారు ఏంటి అని" నేను వెనకాల నుంచి విండో ఓపెన్ చేసి చూసాను. కెమెరా మెన్ డైరెక్టర్ ని ఉద్దేశించి తన అసిస్టెంట్ తో అంటున్నాడు." వీడేదో ఒరిజినల్ సినిమా తీసినట్టు ఫీల్ అవుతున్నాడు, అన్ని సీన్స్ ఏదో ఒక హాలివుడ్ మూవీ నుంచి కాపీ చేసినవే కదా, సుబ్బారావు కంపూటర్ ఆన్ చేసి రీసెంట్ ఫైల్స్ చూడు, వాడు చెప్పిన సీన్ ఉంటుంది", నిజంగానే ఓపెన్ చేయగానే "ది న్యూ పోలీసు స్టొరీ" అనే ఇంగ్లీష్ మూవీ వస్తుంది. డైరెక్టర్ చెప్పిన సీన్ దాంట్లో నుండి కాపీ కొట్టిందే. ఆ సీన్ లైటింగ్, యాంగిల్ చూసుకుని బయటికి వచ్చి సర్ ఓ.కే అన్నాడు." వార్నీ దీన్ని బట్టి చూస్తే వీలు చేసేది అంత కాపీ యేనా" అని ఆశ్చర్య పోయాను.నెక్స్ట్ హీరో గారికి సీన్ చెప్పగానే హీరో కూడా "జస్ట్ ఫైవ్ మినట్స్" అని చెప్పి మళ్ళి అదే బస్ లోపలికి వెళ్ళాడు. ఎందుకేల్లాడో నేను చెప్పకర్లేదు, ఈ పాటికి మీకే అర్థమై ఉంటుంది.

                        కాపీ కొట్టిన సీన్ ని సక్సెస్ ఫుల్ గా చిత్రీకరించి షూటింగ్ గ్యాప్ లో "కొద్ది సేపు ఒకరిని ఒకరు పోగుడుకునే కార్యక్రమం కోసం మరియు సినీమా ప్రమోషన్ లో బాగంగా" నన్ను పిలిచారు ఇంటర్వ్యూ ఇవ్వడానికి. సెట్ లో హీరో, హీరోయిన్ "పడుకునే దీపిక", ప్రధాన పాత్ర దారి డా. మో"గన్" బాబు, డైరెక్టర్ "దోస దొంగనాథ్", నిర్మాత "దారిన పోయే దానయ్య", ఆర్ట్ డైరెక్టర్ కూర్చుని ఉన్నారు.


                                                                      

నేను: మీ ఈ "బద్మాష్ బాడుకావ్"  సినీమా ఎలా ఉంటుంది సర్? ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అని మీరు అనుకుంటున్నారు సర్?

డైరెక్టర్: ఈ "బద్మాష్ బాడుకావ్" సినీమా ని చుసినట్టైతే ఇది ఒక డిఫరెంట్ మూవీ. నాకు తెలిసి తెలుగు స్క్రీన్ మీద ఇంత వరకు ఇలాంటి కథే రాలేదు అంటే నమ్మండి.హీరో కారెక్టర్ వచ్చి ఒక "మాస్" పేద వాడు, హీరోయిన్ వచ్చి చాలా రిచ్. ఇద్దరు ఎలా కలిసారు అన్నది ఇంటరెస్టింగ్ పాయింట్. కదండీ నిర్మాత గారు.    

నేను: "విలన్" హీరోయిన్ ఫాదరా సర్?

డైరెక్టర్: అరె!మీరు బలే కనిపెట్టేసారే. మా అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పాడా మీకు?

నేను: హి హీ..........(మనసు లో .....దీనికి వేరే ఒకడు చెప్పలట్రా..."మార్తాండ బ్లాగు లో మ్యాటర్ ఉంటుందనుకుని  క్రమం తప్పకుండా ఫాలో అయ్యే వాడి ఫేసు నీదీను".......  ఇలాంటి కథ ఉన్న ఏ సినిమా చూసిన హీరోయిన్ నాన్నే కదరా విలన్).    

నిర్మాత: (పక్కనున్న తడిసిన తడి బట్ట ఒకటి తీసుకుని నెత్తి మీద వేసుకుని) ఔను కద..... అబ్బాయి  ఇది సా..........నా ......... డిఫరెంట్ మూవీ.

నేను:  డైరెక్టర్ గారు మీరు ఈ మూవీ కి ఈ హీరో నే కరక్ట్ అని ఎలా అనిపించింది.

డైరెక్టర్: నేను కథ రాసుకునే అప్పుడే నాకు దాంట్లో హీరో గారి బాడి లాంగ్వేజ్ కనిపించింది. అలాగే సార్ లుక్స్, సార్ స్టార్ స్టేటస్ ఇవన్ని కూడా కథకి ప్లస్ అవుతాయి.(మనసులో...........ఈ కథ ఎంత మందికి చెప్పిన ఈ బకరా హీరో తప్ప ఎవడు ఒప్పుకోలేదు, లేక పోతేనా వీడు నా సినీమా లో కమెడియన్ కి కూడా పనికి రాడు). అందం లో అక్కడ హాలివుడ్ లో ఎంజలిన జోలి, మళ్ళి  నెక్స్ట్  డైరెక్ట్ ఇక్కడ  మన హీరోనే.
 
                  డైరెక్టర్ అసలు ఇపుడు హీరో ని పోగిడాడా, లేక అమ్మాయి తో పోల్చి తిట్టాడా? లేక అసలు వీడికి ఎంజలిన జోలి అంటే అమ్మాయి అని తెలియదా? సరే లే ఏదైతే మనకేంటి మనం తరువాతి ప్రశ్న కి వెళ్లి పోదాం.

నేను: సార్ డైరెక్టర్ "దోస దొంగనాథ్" గారు మీ ప్రతి సినీమా లో డైలాగ్స్ చాలా కొత్తగా (చెత్త గా) ఉంటాయ్ కదా, మరీ ఈ సినిమా లో డైలాగ్స్?    
             
డైరెక్టర్ "దోస దొంగనాథ్": "రేయ్ నేను నా బుర్ర లో ఒక్కసారి ఫిక్స్ అయితే మీ పుర్ర్రే పగిలేంత వరకు మీ అమ్మా మొగుడే కాదు మా అమ్మా మొగుడు వచ్చి చెప్పినా వినేదే లేదు" ఇది హీరో ఇంట్రడక్షన్ లో రౌడి లతో చెప్పే డైలాగ్.

నేను: సార్ ఈ సినిమాను "ఏ అమ్మా మొగుడు" వద్దని చెప్పినా జనాలు ఈ సినీమా ను వదలరు సార్. ఐ మీన్ చూస్తారు సార్.(ఇది మాత్రం నిజం).

డైరెక్టర్ "దోస దొంగనాథ్": ఈ సినీమా లో హీరో హీరోయిన్ తో చెప్పే ఒక డైలాగ్."ఒసేయ్  నేను ఒక ఎర్రి......, నేను ఒక చెత్త వెధవ, నేను పెద్ద "బద్మాష్ బాడుకావ్" ని (టైటిల్ జస్టిఫికేషన్). ఐన సరే నువ్ నన్నే లవ్ చేయాలే, ఎందుకంటే ఆ దేవుడు, మీ బాబూ ఇద్దరూ... నిన్ను నా కోసమే  పుట్టించారు  కాబట్టి. "రా..... వచ్చి వాటేసుకుని ముద్దులేట్టేసుకోవే........... మనలో మనకు మొహమాటాలేంటే".

నేను: మరీ అప్పుడు నెక్స్ట్ హీరోయిన్ డైలాగ్ ఏంటి సార్.

డైరెక్టర్ "దోస దొంగనాథ్": అదోచ్చి హీరోయిన్ ఫస్ట్ డైలాగ్ " రేయ్ నీ యబ్బా..దొంగ నా కొడకా....! బలుపెక్కి బజార్ లో కొట్టుకుంటూన్నావ్ రా. నీది లాగి................కట్ చేస్తా" అనగానే హీరోయిన్ వెంట పడుతూ వెంటనే హీరో సాంగ్.       

నేను: సార్ నిర్మాత గారు, ఈ సినిమా కోసం స్పెషల్ గా మిమ్మల్ని డైరెక్టర్ ఒక సెట్టు వేయించమని అడిగారట. దాని గురించి కొంచం మా ప్రేక్షకుల కోసం.

నిర్మాత: (మనసులో ............ఈ వెధవ డైరెక్టర్ ఒక సెట్టే అడిగాడా..ఇంకా చాలా చాలా అడిగాడు, బ్యాంకాక్ షూటింగ్ లో ఉన్నపుడు హైదరాబాద్ హోటల్ తాజ్ నుంచి బిర్యానీలు, తమిళనాడు వజ్ర మీన్లు, ఇక్కడ షూటింగ్ చేసినపుడేమో లాస్ వేగాస్ లో పార్టి మేను ఐటమ్స్ .........ఇవన్ని ఎవడితో చెప్పుకోవాలి) నిజమేనండి పది కోట్ల రూపాయలతో ఒక హాలివుడ్ స్మశానం సెట్ వేయించాము. మీరు దాని గురించి మా ఆర్ట్ డైరెక్టర్ ని అడగండి.

ఆర్ట్ డైరెక్టర్: నేను "అదిగో పులి అంటే ఇదిగో తారక రత్న" అనే సినిమా షూటింగ్ లో ఉన్నపుడు డైరెక్టర్ గారి దగ్గర నుండి కాల్ వచ్చింది. ఇలా ఒక స్మశానం సెట్ వేయాలని. నేను సార్ కి చాలా డిజైన్స్ చూపించాను. కాని ఏది ఓ.కే. కాలేదు.అంతలో మా చిన్నాడు నేను నా చిన్నపుడు గీసిన మా ఇంటి బొమ్మల బుక్ తో ఆడుకుంటున్నాడు.డైరెక్టర్ సార్ వాటిని చూసి షాకై " సార్ నేను అనుకుంటున్నా స్మశానం ఇలానే ఉంటుంది సార్, ఇది ఓ.కే. అన్నాడు " అలా ఆ సెట్టు కి ప్రాణం పోసాను.

నేను: (మనసు లో.......అబ్బో చాలా ఉందే కథ....................ఇది కూడా ఒక రకం పబ్లిసిటి నా ............ )

                అంతలో గిటార్ పట్టుకుని ఒక వింత మనిషి అటు వైపు గా రాగానే డైరెక్టర్ నాకు పరిచయం చేసాడు ఇతనే మా సినిమా "మ్యూజిక్ డైరెక్టర్" బక్రి అని.( మే బి చేతిలో ఆ గిటార్ లేక పోతే మ్యూజిక్ డైరెక్టర్ అని గుర్తు పట్టరు అని గిటార్ పట్టుకుని తిరుగుతుంటాడు కావచ్చు). వచ్చి రాగానే "బత్తే........... ఎహే బత్తే... ఆ సత్తే......... ఆ బత్తే" అంటూ పాడటం మొదలెట్టాడు.ఆ దెబ్బ కి అప్పటిదాకా సెట్లో దాక్కున్న ఎలుకలన్నీకూడా పరుగు లంకించుకున్నాయి.

నేను: సార్ ఈ సినీమా లో పాటలు ఎలా ఉంటాయ్. కొంచం ఆడియో గురించి చెప్పండి సర్.

మ్యూజిక్ డైరెక్టర్ బక్రి : నేను ఆ మధ్య దుబాయ్ లో స్టేజి షో కి వెళ్లినపుడు నన్ను అక్కడి తెలుగు వాళ్ళు "తెలుగు హిమేష్ రేష్మియా" అని పొగిడారు. నేను పాట పాడుతుంటే  ఆనందం తో వాళ్ళు టి-షర్ట్స్, గాగుల్స్ నా మీదకి విసిరారు.

నేను: ఆ షో లో కి చెప్పులు, వాటర్ బాటిళ్ళు  ఆలో లేదు కదా సార్.( అవి ఉంటే టి-షర్ట్స్, గాగుల్స్ఎందుకు విసురుతారు)

మ్యూజిక్ డైరెక్టర్ బక్రి : యా!.ఇట్స్ సర్ప్రైసింగ్. నీకెలా తెలుసు. ఆ షో కి నువ్ కూడా వచ్చావా?

నేను:(మనసులో .........అంత దైర్యం నాకెక్కడిది, ఐనా పాటల గురించి చెప్పమంటే చెదలు పట్టిన చరిత్ర చేబుతావేంటి రా.......ఐన "ఫూచర్ హిమేష్ రేష్మియా" అంటే పోగిడినట్టు కాదు రా తిట్టినట్టు. "ఆనాడు ఆ "బ్రిటిష్" వాళ్ళు మనల్ని పాలించి చంపుకు తింటే ఈనాడు ఈ "హిమేష్" పాడి చంపుకు తింటున్నాడు".) సార్ ఇంతకి పాటల గురించి చెప్ప లేదు మీరు.

మ్యూజిక్ డైరెక్టర్ బక్రి : ఎప్పుడయ్య మీ మీడియా వాళ్ళు డెవలప్ అయ్యేది, అర్థం చేసుకోవాలి. అంటే నేను అంత బాగా ఈ సినీమా కి మ్యూజిక్ ఇచ్చానన్న మాట.

నేను: హీరోయిన్"పడుకునే దీపిక" గారు మీరు చెప్పండి మీ కారెక్టర్ గురించి.

"పడుకునే దీపిక" : yeah, i am "పడుకునే దీపిక". it's my first film in  టెల్గు. టెల్గు పీపుల్ కి నా వందనం.(అని కాసేపు ప్రొడ్యూసర్, డైరెక్టర్ చేసిన చిలిపి పనులు గుర్తుకు తెచ్చుకుని నవ్వి.........) and i am very thankful to my producer "దారిన పోయే దానయ్య" గేరు and డిరెక్టర్ "దోస దొంగనాథ్" గేరు. in this movie i am doing the very bubly role and very interesting charector.my heero is so supportive.(మళ్ళి నవ్వు.......హీరో చేసిన చిలిపి పనులు గుర్తుకు తెచ్చుకుని...)

నేను: హీరోయిన్ గారు మీరు ఈ సినీమాలో హీరో గారి బాబు తో నటించారు కదా. ఆ అనుభవం ఎలా ఉంది.

"పడుకునే దీపిక" : yeah i did in one scene. అది వచ్చి హీరో గేరి అబ్బాయి తో "పడుకునే" సీన్.

హీరో: మేడం అది "పడుకునే" సీన్ కాదు, "ఆడుకునే" సీన్.

"పడుకునే దీపిక" : yeah, yeah its playing with the boy.
   
నేను: హీరో గారు మీరు చెప్పండి ఈ సినిమా కథ వింటున్నపుడు మీకు ఎలా అనిపించింది.

హీరో: నేను ఈ కథ వింటున్నపుడే చాలా ఫ్రెష్ గా అనిపించింది.ఇది ఒక అన్ని కమర్షియల్ విలువలున్న డిఫరెంట్ సబ్జెక్ట్. దీంట్లో అంతర్లీనంగా ఒక మెసేజ్ కూడా ఉంటుంది.ఇలాంటి ఒక సినీమా కి "దారిన పోయే దానయ్య" లాంటి ఎక్కడా కంప్రమైజ్ కాని నిర్మాత దొరకడం మా అదృష్టం. (మొన్నే నిర్మాత హీరో గారి పుట్టిన రోజు కి  మెర్సిడెజ్ బెంజ్ కార్ గిఫ్ట్ గా ఇచ్చాడు). ఇక డైరెక్టర్ "దోస దొంగనాథ్" తో షూటింగ్ అంటే అసలు షూటింగ్ చేసినట్టే ఉండదు. నా అబిమానులు మెచ్చే చిత్రమవుతుంది ఇది. "కచ్చితంగా ఈ చిత్రం నాకు ఒక విందు భోజనం లాంటిది".
 
                  పక్కనున్నఅసిస్టెంట్ డైరెక్టర్ మనసు లో గోనుక్కుంటున్నాడు, " ఇక్కడ కూడా తిండి ధ్యాసే,పిజ్జా కార్నర్ లో సాఫ్ట్ వేర్ వాళ్ళు సగం తిని మిగిల్చిన పిజ్జాలని హాఫ్ రేటుకు కొనుక్కుని తినే వెధవ". "దోస దొంగనాథ్" తో షూటింగ్ అంటే అసలు షూటింగ్ చేసినట్టే ఉండదా. అది నిజమేలే అంతా అసిస్టెంట్ డైరేక్టర్లె చూసుకుంటే ఆ దోస మొహం తో షూటింగ్ చేసినట్టు ఎలా ఉంటుంది.

నేను: విలక్షణ నటుడు  డా. మో"గన్" బాబు గారు, సార్ మీరు చెప్పండి మీ పాత్ర గురించి.

డా. మో"గన్" బాబు: ఆ బాబా  దయ వల్ల మా గురువు గారు "డా.బాసరి" దయ వల్ల నేను 500 కు పైన సినీమాల్లో నటుడి గా వివిధ రకాల పత్రాలు చేసాను. 50 కి పైగా సినీమాలు నిర్మించాను, ఇంకా నిర్మిస్తూనే ఉన్నాను. వంద కి పైగా సినీమాల్లో హీరో గా నటించాను.నేను "నా నికేతన్" స్థాపించి   పది వేల మంది పిల్లలకి చదువు చెప్పిస్తున్నాను. "నేను కాదా లెజెండు". అసలు లెజెండు కి సెలబ్రిటీ కి తేడా ఏంటి? నీకు తెలుసా?

నేను: వాయ్యో!........ మనోడు ఇంకా ఆ "రాగోత్సవాల" నుండి ఇంకా తెరుకోనట్టున్నాడు. సార్ సార్ అది కాదు సార్ ఈ సినీమా గురించి మీ అబిమానులకి చెప్పేది ఏమైనా ఉందా.

డా. మో"గన్" బాబు: నేను అబిమానులకి చెప్పేది ఒక్కటే మనం ఆ నటుని అబిమానుల్లా చిల్లర పనులు , వెర్రి చేష్టలు చేయ కూడదు. మనం క్రమ శిక్షణ తో మెలగాలి, డిసిప్లెన్ గా ఉండాలి. చివరి గా చెప్పేది ఒక్కటే...... ఈ సినీ ఇండస్ట్రి ఏ ఒక్కరి సొత్తు కాదు, ఈ కళామ తల్లి అందరిది.
     
వార్నీ....... ఈయన గారికి మైకు ,మీడియా వాళ్ళు కనబడితే చాలు ఆ నటున్ని దెప్పి పొడవడమే పని గా పెట్టుకున్నట్టుంది అనుకుంటూ ఉండగానే దూరంగా ఇంకో అసిస్టెంట్ డైరెక్టర్ "సార్ షాట్ రెడీ" అని అరిచాడు.

నేను: సార్ ఈ ప్రోగ్రాం ముగించే ముందు మీరు మీ యూనిట్ తరుపున మా ప్రేక్షకులకి...........(అనగానే)

నిర్మాత: ఎందయ్యో! ఈ ప్రోగ్రాం సూసేందుకు ఆళ్ళకి కూడా డబ్బులీయల్నా ఏందీ? ఇపుడు మీ టి.వి. వోల్లకిచ్చెందుకే నేను మా యావిడ నగలు తక్కట్టు పెట్టుండ్ల? 

నేను: అది కాదు సార్ సందేశం.

నిర్మాత: అట్నా....  "తల నొప్పి కి యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో బిల్ కట్టినంత పని చేసావ్ కదయ్యా . సరే కానియ్.

                  "ఇప్పటికే నెట్ లో దొంగతనంగా(పబ్లిసిటీ కోసం మేమే ముందుగా) రిలీజ్ ఐన మా పాటల్ని మీరు చాలా బాగా ఆదరిస్తున్నారు. అలాగే  నిర్మాత ల్యాబు వాళ్ళకి డబ్బులు కట్టిన తర్వాత విడుదలయ్యే మా సినీమా ని కచ్చితంగా థియేటర్ల లోనే చూసి ఆదరించండి. అండ్ కిల్ పైరసీ. పైరసీ సిడీలు ఎక్కడ దొరికినా మాకు ఇన్ఫార్మ్ చేయండి. మా హీరో వచ్చి ఆ షాపు వాడికి డబ్బులిచ్చి చితకబాది  కొంచం మాస్ ఇమేజ్ పెంచుకుంటాడు. అది కూడా మా సినీమా పబ్లిసిటి కి ఉపయోగ పడుతుంది.ఈ అవకాశం మాక్కల్పించిన "ఓ" టి.వి యాజమాన్యానికి, ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు".  

4 comments:

  1. వీరో వీరోయిన్ల "ఆన్‌స్క్రీన్‌కెమిస్ట్రీ" అదుర్సటగందా(హిహిహి)...

    ReplyDelete
  2. Too good! LOL

    "మార్తాండ బ్లాగు లో మ్యాటర్ ఉంటుందనుకుని క్రమం తప్పకుండా ఫాలో అయ్యే వాడి ఫేసు నీదీను"
    _________________________________________________

    LOOOOOL

    ReplyDelete