Monday, January 11, 2010

ఒక నిక్కరు, ఒక ఐస్ ప్రూట్, ఒక సైకిల్ టైర్. ఇదీ స్టొరీ !

                      నేను అంతర్జాలం తెరిచి చూస్తున్నాను.ఏవైనా కొత్త గా పిల్లి మొగ్గలు వేద్దామని ఆలోచిస్తున్నాను. అంతలోనే ట్రింగ్ ట్రింగ్ మని శబ్దం.అదీ మా ఆఫీస్ ల్యాండ్ లైన్. దీనికి చాలా కుళ్ళు ఎక్కువ, నేను ఎప్పుడు నెట్ ఓపెన్ చేసిన ఇది గమనించి కావాలని మరీ డిస్టర్బ్ చేస్తుంది.ఎందుకంటారా? మనకి నెట్ రాకముందు రోజు దీని తోనే గడిపేది.ఫ్రెండ్స్ ని తిట్టాలన్నా, గాళ్ ఫ్రెండ్స్ తో కబుర్లకైన,లవర్ తో తిట్లు తినాలన్నా అప్పుడు అదే గతి. వేరే ఆల్టర్ నేటివ్ లేదు. నెట్ వచ్చాక ఆన్ లైన్ లో ఎక్కువ వుండడం స్టార్ట్ చేసాను. ఇక అప్పటి నుండి సవతి పోరు స్టార్ట్ ఐంది. అందుకే నేను తీయలేదు. మళ్ళి ఫోన్ వచ్చింది. కాని ఈ సారి అది ట్రింగ్ ట్రింగ్ అనలేదు."రేయ్ ఎదవా రోజు కి 20 గంటలు దానితోనే ఉంటున్నావ్ కదరా, కనీసం అప్పుడప్పుడైనా నన్ను చూడు. అక్కడ నాగార్జున నన్ను ఓ.......పిసికేస్తున్నాడు, నువ్వు అనుష్క ని పంపించలేదని".

                   అయ్ బాబోయ్ అదేంటి నేను పంపించా కదా! అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసాను. ఫోన్ లో మా బాస్ చెవి లో పుల్ల తో తిప్పుకుంటూ లేజీ...గా "ఏం కిషోర్ నీకు తెలుసుగా నాన్న అక్కినేని కి కనీసం వారానికి ఒక్కరోజైనా "అనుష్క" ని పంపించాలని, అనుష్క ని కింది నుండి పై దాకా చూడకపోతే నిద్ర పట్టదని, ఏంటి ఈ వారం పంపించలేదు. "లేదు సర్ నేను త్రిష, నయనతార, తమన్నా లతో పాటు అనుష్క ని కూడా పంపించాను కదా సార్. మీ దగ్గరకు రాలేదా? అని అడిగాను. 'ఆ వచ్చింది కాని అబ్బాయ్ "నాగ చైతన్య" ఏదో కొత్త సినిమాకి ఫైనాన్షియర్ దొరికితే "అనుష్క ని ఆ  ఫైనాన్షియర్ దగ్గరకి తీసుకెళ్ళాడు. నువ్ మళ్ళి పట్రా వెళ్లి అర్జెంట్ గా.

                    మీరేం కంగారు పడొద్దు నేను ఆ పాయింట్ కే వస్తున్నా. మా బాస్ కి సినీమాల పిచ్చి. ఆఫీస్ కి సంబంధించి విషయాలన్నీ కూడా ఆయన సినీమా బాషలోనే మాట్లాడతాడు. త్రిష అంటే సేల్స్ స్టేట్ మెంట్, నయనతార అంటే స్టాక్ స్టేట్ మెంట్, తమన్నా అంటే అవుట్ స్టాండింగ్ స్టేట్ మెంట్, అనుష్క అంటే బ్యాంకు స్టేట్ మెంట్. సినీమా అంటే ఫ్యాక్టరీ.

                     సరేలే వేల్లోద్దాం, బ్యాంకు కూడా మా ఆఫీస్ కి "అజిత్ అగార్కర్ బౌలింగ్ లో ఆడం గిల్ క్రిస్ట్ సిక్సర్ కొట్టినంత దగ్గరే" కదా అని నడుచుకుంటూ వెళ్ళాను. గంట సేపు లైన్ లో నిలబడి అనుష్క ని పట్టుకుని బయలు దేరాను.

                    బ్యాంకు నుండి వస్తుంటే దారిలో ఒక పిల్లాడు "ఒక బుల్లి నిక్కరు వేసుకుని ముక్కులోంచి చీముడు కారి పై పెదవిని తాకుతుంటే ఒకచేత్తో పుల్ల ఐస్ ప్రుట్ ని నోట్లో పెట్టుకుని తింటూ,అప్పుడప్పుడు జారిపోయే నిక్కరును అదే చేత్తో పైకి లాక్కుంటూ, ఇంకో చేత్తో సైకిల్ టైర్ అట ఆడుతూ పరిగెడుతున్నాడు".  (వాహ్,సేబాష్ సేబాష్ రా కిషోర్. చీముడు ముక్కు, నోట్లో ఐస్ ప్రుట్, చేతిలో టైర్. ఇలాంటి గ్రేట్ కాంబినేషన్స్ నీకు తప్ప ఎవరికి తట్టవ్ రా. నువ్ దంచేయ్ ఇక. ఏమైనా అయితే నేను చూస్కుంట. ఎలాగు పారి పోయి దాక్కోవడానికి మనకు పాకిస్తాన్ కూడా ఉంది కదా) నాకు ఆ సీన్ చూడగానే నా కళ్ళ ముందు గుండ్రాలు గుండ్రాలు తిరుగుతూ నేను ఫ్లాష్ బాక్ కి వెళ్ళలేదు. సింపుల్ గా కెమెరా పక్కనున్న మురికి కాలువ మీదకి వెళ్ళింది.దాంట్లో మురికి నీళ్ళని కొద్ది సేపు చూపించి మళ్ళి యధా స్థానానికి వస్తే మా ఊళ్ళో మురికి కాలువ పక్కన నేను, అశ్విన్ గాడు నిక్కర్లేసుకుని నోట్లో పుల్ల ఐస్ ప్రుట్ తో.అప్పుడు నా వయస్సు 8 సంవత్సరాలు .


                                                                             
                          "అరేయ్ ప్లీజ్ రా ఒక్క గంట సేపు ఇవ్వురా ఆడుకుని మళ్ళి నీ టైర్ నీకు ఇచ్చేస్తా ప్లీజ్ రా దయచేసి" అని నేను బతిమాలుతున్నాను అశ్విన్ గాడిని. "నేను ఇవ్వను పో, మొన్న నన్ను కాదని ఆ  గోపి గాడితో గోలిలాడావ్ కదా. నీ దోస్త్ కటీఫ్ అన్నా కదా పో" అని అశ్విన్ గాడు. కొద్ది సేపు అలా అడిగి ఇక లాభం లేదని బ్లాక్ మెయిలింగ్ కి దిగాను."టాన్, టాన్"  రేయ్ అశ్విన్ నువ్ ఆ టైర్ నాకు ఇవ్వకపోతే "అను వాళ్ళ పెద్దక్క కి లవ్ లెటర్లు పాస్ చేసేది నువ్వే అని చెబుతా అను తో" తెలుసు గా అదీ అసలే "రెండు జడల సన్నపనేని" అని.అనేసరికి "చెప్పుకో అయితే ఏంటి నేను కూడా చెబుతా అను వాళ్ళ చిన్న అక్కయ్య కి లవ్ లెటర్లు పాస్ చేసేది నువ్వే అని నేను కూడా చెబుతా" అని వాడు రివర్స్ పంచ్ ఇచ్చాడు. అమ్మో ఈ విషయం దానికి తెలిస్తే ఏమైనా ఉందా అదీ "రెండు జడల సన్నపనేని" తో పాటు, "గాగ్రా చొలి గంగా భవాని" కూడా అవుతుంది.

                     అంతలోనే అక్కడ ఏదో భూకంపం రాబోతున్నట్టు చిన్న అలికిడి.ఒకే సారి పెద్ద హోరు గాలి.ఆ గాలిలో ఆ ఉక్కు పాదాల కింద మేం నలగలెం అన్నట్టు గా ఏందీ పోయి రాలిన ఆకులన్నీ పనిగట్టుకుని ఎటో వెళ్లి పోతున్నాయ్. అనుమానం ఏమి లేదు కచ్చితంగా 'అను' ఈ దరి దాపుల్లోనే ఉంది అనడానికి సూచనలు.ఆకు పచ్చ లంగా, తెల్ల చొక్కా, పసుపు రిబ్బన్లుకట్టుకుని కారే చీముడు ముక్కు తో నోట్లో బొటన వేలేట్టుకుని చిన్న సైజు గున్న ఏనుగులా  వడి వడి గా అడుగులు వేసుకుంటూ వస్తుంది  " లేడి రౌడి అను". బ్యాక్ గ్రౌండ్ లో ఏనుగు ఘీంకరించినట్టు పెద్ద శబ్దం.
 
                       వస్తూ వస్తూ ఒక చిన్న పిల్లాడి చేతిలో ఐస్ ప్రుట్ లాక్కుని తినుకుంటూ ఇటు వైపే వస్తుంది అను. ఆ పిల్లాడు కింద పడి గిలగిల కొట్టుకుంటున్నాడు ఎండ లో. అదీ అసలే తిండి బోతూ మా ఐస్ ప్రూట్ కూడా లాక్కుంటుందని తెలిసి నేను అశ్విన్ గాడు ఒకరి ముఖం ఒకరం చూసుకుని, తర్వాత మా చేతిలో ఐస్ ప్రూట్ లను చూసుకుని, ఒకే సారి నోట్లో ఉమ్మునంత జమ చేసి "యాక్ థూ" అని ఉమ్మేసాం ఐస్ ప్రూట్ల మీద. మేం అనుకున్నట్టు గానే అదీ వచ్చి మా ఐస్ ప్రూట్లని లాక్కుంది, మేమెక్కడ మళ్ళి అడుగుతామేమో అని వెంట వెంటనే తినడం మొదలు పెట్టింది. అదీ చూసిన అశ్విన్ గాడికి కడుపులో దేవినట్టై వాంతి చేసుకున్నాడు. "ఏంటి వాడు వాంతి చేసుకుంటున్నాడు" గద్దింపు స్వరం తో అడిగింది అను. "ఏం లేదు ఊరికే" అన్నాను పక్కకి తిరిగి, ఆ ఐస్ ప్రూట్ అది తినడం చూడలేక.సీరియస్ గా అను నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ " నాకు తెలుసు వాడు ఎందుకు వాంతి చేసుకుంటున్నాడో, మీరిద్దరూ నేను వచ్చే ముందే ఐస్ ప్రూట్ల మీద ఉమ్మేసారు కదూ, నేను చూసా" అంది ఐస్ ప్రూట్ లని జుర్రుకుంటూ. ఈ సారి వాంతి చేసుకోవడం నా వంతయింది. మళ్ళి మేం మామూలు మనుషులం కావడానికి వారం పట్టింది.

                   మళ్ళి కొన్ని రోజుల తర్వాత అదే కాలువ గట్టున నేను అశ్విన్ గాడిని బతిమాలుతున్నాను, "టైర్ ఇవ్వు రా ప్లీజ్, నీకు ఏం కావాలంటే అది ఇస్తా ప్లీజ్ రా" అని. ఈ సారి వాడు కొంచం సేపు ఆలోచించి ఏం కావాలన్న ఇస్తావా అన్నాడు. ఇస్తా లేరా చెప్పు ఏంటో అని అడిగాను. "మరేమో మరేమో అది మీ ఇంట్లో చికెన్ చేసినపుడు నాక్కూడా తేచ్చివ్వాలి చికెన్. ఓ.కే నా? అన్నాడు. నేను కూడా ఓ.కే అన్నాను. మీకు చెప్పలేదు కదూ వీడికి చికెన్ అంటే ప్రాణం.వీడు చికెన్ గున్యా తో చచ్చే ముందు చీకట్లో దేవుడు ప్రత్యక్షమై ఇప్పుడు చెప్పు నీకు నీ ప్రాణం కావాలా? చికెన్ కావాలా అని అడిగితే నిస్సందేహంగా చికేనే కావాలని అడిగే రకం వీడు. వీడి ఫేవరేట్ పాట కూడా "దోమ కుడితే చికెన్ గున్యా ఆహ్.. ఆహ్.. ప్రేమ కుడితే సుఖం గున్యా ఆహ్..ఆః.." అనే పాటే. ఎందుకంటే ఆ పాటలో చికెన్ ఉంది కాబట్టి. వీడు పుట్టినపుడు వీళ్ళ నాన్న "ఆరు కోళ్ళ ఫారాలకు ఓనర్". వీడికి ఆరేళ్ళు వచ్చే సరికి "అదే కోళ్ళ ఫారం క్లీనర్". అంతా వీడి చలవే. ఎలా అయితే ఏంటి మా ఇద్దరి మద్య కుదిరిన కోళ్ళ ఒప్పందం తో నీ టైర్ ఆట మూడు రీములు ఆరు టైర్లు గా సాగిపోతుంది.

                      చూస్తూ చూస్తూ ఉండగానే 3 వ తరగతి సంవత్సరపు పరీక్షల రూపం లో పెద్ద అగ్ని పరీక్ష ఎదురయింది. మనం పట్టించుకుంటేనా? నేను ఎంచక్కా స్కూల్ కి వెళుతున్నా అని చెప్పి ఇంటి నుండి బయలుదేరడం, స్కూల్ కి వెళ్ళకుండా డుమ్మా కొట్టి కాలువ గట్టు దగ్గర టైర్ తో ఆడడం.ఒక సారి అలానే స్కూల్ ఎగ్గొట్టి టైర్ పట్టుకుని ఆడుతుంటే "ఎవరో పెద్ద మనిషి అడ్డోచ్చాడు" నేను ముఖం చూడకుండా "కీక్, కీక్, కీక్,కీక్" పక్కకు తప్పుకోండి అన్నాను హరన్ కొడుతున్నట్టు, కాని ఆ మనిషి తప్పుకోలేదు. ఎవర్రా అని తల పైకెత్తి చూసే సరికి.......................'అయ్ బాబోయ్ మా నాన్న'. కెమెరా ఆటోమేటిక్ గా అదే కాలువ గట్టున బట్టలుతుకుతున్న చాకలి బండ మీదకెల్లింది. నెక్స్ట్ సీన్ లో కమిలి పోయిన కన్నుతో,ఉబ్బి పోయిన దవడ తో స్కూల్ లో మోకాళ్ళ మీద కూర్చుని చదువుతున్నాను " long long ago so long ago there was a tyre in my home" అని.

                      ఎలాగోలా 3 వ తరగతి పరీక్షలు 3rd క్లాసు లో పాసయ్యాను. ఇప్పుడు వేసవి సెలవులు కదా జాలి డేస్ అన్న మాట, అందుకని అమ్మ దగ్గరికెళ్ళి గారాలు పోతు "అమ్మ అమ్మ నాకొక కొత్త టైర్ ఒకటి కొనివ్వవే, నేను టైర్ఆట  ఆడుకుంట" అన్నా.అప్పుడు మా అమ్మ "బాలయ్య కే లేక రాజమౌళి శిష్యుడి డైరెక్షన్ లో చేస్తుంటే, తారక రత్నోచ్చి  రాఘవేంద్ర రావు (రాజమౌళి గురువు) తో సినిమా చాన్సు ఇప్పివ్వమని అడిగాడంట" అలా ఉంది రా నీ కథ. మీ నాన్న కే లేక డోక్కు సైకిల్ తొక్కుతుంటే నీకు కొత్త టైర్ కావాలా?వెళ్లి మీ నాన్ననే అడుగు పో అంది. అప్పుడే నాకు పళ్ళ రసం (పాద రసం ఓల్డ్ కదా) లాంటి ఐడియా ఒకటి వచ్చింది. నాన్న పాత సైకిల్ ని పాడు చేస్తే.........................
ఒకే దెబ్బ కి రెండు పిట్టలు. నాకు టైర్, నాన్న కి కొత్త సైకిల్.

                      నేను ఆ పని లో పడ్డాను. అమ్మ దగ్గర పిన్నిస్ సంపాదించి టైర్లని కసిదీరా పంచర్ చేస్తున్నాను.అంతలోనే వీధి గుమ్మం తలుపులు 'ధడేల్' మని తెరుచుకున్నాయ్. మా నాన్న అప్పుడే చేపల మార్కెట్ కి వెళ్లి రెండు పెద్ద పెద్ద చేపల్ని పట్టుకొచ్చాడు.ఇంకేముంది ఈ సారి కెమెరా మా అమ్మ ఆ చేపల్ని పొలుసులు ఊడేట్లు బండకేసి రాకే దృశ్యం వైపు వెళ్ళింది. నెక్స్ట్ సీన్ లో "మా అత్తమ్మ నాకు స్నానం చేయిస్తూ డైలాగ్ "చెబితే విన్నావ్ కాదు, ఇప్పుడు చూడు ఏమైందో, మూతి ఏదో ముక్కు ఏదో తెలియట్లేదు"

                       ఇలా నేను రోజు ఎన్ని దెబ్బలు తిన్నా పట్టు వదలని నితిన్ లా ఒక జయం జెండా పట్టుకుని సైకిల్ టైర్ కోసం తిక్క వేషాలేయడం, మా నాన్న కి దొరికి పోవడం, కెమెరా గోడక్కోట్టిన పిడకల మీదకి, వీధి చివరన తొక్క తీసి రసం చేసే జూస్ సెంటర్ మీదకి, లేక పోతే అరవ హోటల్ లో కాళ్ళతో పిండి పిసికి పరోటాలు చేసే ప్రాసెస్ మీదికో వెళ్ళటం, ఇదే రోజు తంతు.ఇది ఇలా సాగుతుండగా ఒక రోజు సడెన్ గా ఒక శుభ వార్త "నా పేరిట మా అమ్మ నెలకి ఐదు రూపాయలు కడుతున్న 'భాగ్య లక్ష్మి బంపర్ డ్రా' లో సైకిల్ వచ్చింది మాకు". నేను మా అమ్మ కొంగు చాటు దాక్కొని మా నాన్న కి వినబడేట్టు అన్నాను."అమ్మ ఇప్పుడైనా నాన్నకి చెప్పు నాకొక కొత్త సైకిల్ టైర్ కొనివ్వమని". ఆ మాట విన్న మా నాన్న నా వైపు తిరిగి చూసాడు. కాని ఈ సారి మాత్రం కెమెరా కన్ను ఎక్కడికి వెళ్ళలేదు. నెక్స్ట్ సీన్ లో దూరంగా అమ్మా, నాన్న నాకు టాటా చెబుతున్నారు. నేను ఆనందం తో నవ్వుకుంటూ లక్కి డ్రా లో వచ్చిన కొత్త సైకిల్(BSA SLR) తో సైకిల్ తొక్కడం నేర్చుకోవడానికి వెళ్తున్నాను.  


                                                                     
                   సరిగ్గా రెండు వారాల తర్వాత నేను, అశ్విన్ గాడు కాలువ గట్టు దగ్గర ఐస్ ప్రూట్ తింటూ................ఈ సారి అశ్విన్ గాడు బతిమిలాడుతున్నాడు నన్ను "ప్లీజ్ రా నాక్కూడా సైకిల్ తొక్కడం ఎలాగో నేర్పించు రా....  ఒక్క సారి నీ సైకిల్ ని ముట్టుకోనివ్వు రా....రేయ్ ప్లీజ్ రా...". మళ్ళి అటు వైపు గా వస్తున్నా అను ని చూసి  నేను అశ్విన్ గాడు మా ఐస్ ప్రూట్ ల మీద "యాక్ థూ".......................................        
    

                                       

6 comments:

  1. >>"అజిత్ అగార్కర్ బౌలింగ్ లో ఆడం గిల్ క్రిస్ట్ సిక్సర్ కొట్టినంత దగ్గరే" :):)

    >>"బాలయ్య కే లేక రాజమౌళి శిష్యుడి డైరెక్షన్ లో చేస్తుంటే, తారక రత్నోచ్చి రాఘవేంద్ర రావు (రాజమౌళి గురువు) తో సినిమా చాన్సు ఇప్పివ్వమని అడిగాడంట" :) :)

    >>" long long ago so long ago there was a tyre in my home" :)))))


    ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. పోస్ట్ ఖుష్. సినిమా సూపర్. :))))

    ReplyDelete
  2. anu mida antha kopam aa... papam ala create chesav

    ReplyDelete
  3. అయ్య బాబోయ్ చివరి దాకా చదివించేసారండి

    నైస్:))

    ReplyDelete
  4. arupu.. garjana.... Keka... Polikeka.... kummesaru...

    ReplyDelete
  5. Hi...
    U have great creativity..
    U r stories r very enjoybe.

    ReplyDelete